వరంగల్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిత్వంపై సస్పెన్స్ తొలగిపోయింది. రెండు రోజుల కిందట కాంగ్రెస్ లో చేరిన కడియం కావ్యను వరంగల్ పార్లమెంట్ అభ్యర్థిగా ప్రకటించారు. ఇటీవల బీఆర్ఎస్ పార్టీకి రాజీనా మా చేసిన కడియం శ్రీహరి, ఆయన కుమార్తె కావ్య రెండు రోజుల కిందట కాంగ్రెస్ పార్టీలో చేరారు. బీఆర్ఎ స్ నుంచి వరంగల్ ఎంపీ టికెట్ కేటాయించినా, ఆ పార్టీని వీడి హస్తం గూటికి చేరారు. అనుకు న్నట్లుగానే కడియం కావ్య వరంగల్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్ధిగా బరిలోకి దిగనున్నారు.
ఏఐసీసీ పెద్దలు, కేసీ వేణుగోపాల్, తెలంగాణ కాంగ్రెస్ కీలక నేతలతో చర్చించిన అనంతరం అధిష్టానం సోమవారం రాత్రి ఈ నిర్ణయాన్ని వెల్లడించింది. కాంగ్రెస్ అధిష్టానం ఇదివరకే అభ్యర్థుల 9 జాబితాలు విడుదల చేయగా, తాజాగా సోమవారం రాత్రి ఇద్దరు అభ్యర్థులతో 10వ జాబితా ప్రకటించారు. మహారాష్ట్ర లో అకోలా నుంచి డాక్టర్ అభయ్ కాశీనాథ్ పాటిల్ ను అభ్యర్థిగా కాంగ్రెస్ అధిష్టానం ప్రకటించింది. ఈ మేరకు ఏఐసీసీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ ఓ ప్రకటన విడుదల చేశారు.
కావ్య విషయానికి వస్తే.. పార్టీ మారారు. టికెట్ తెచ్చుకున్నారు. అదేమంటే బీఆర్ ఎస్ గెలిచేది కాదు.. కాబ ట్టి తాము పార్టీ మారుతున్నామని కావ్య చెప్పారు. మరి ఏమేరకు వరంగల్ పార్లమెంటు ప్రజలు ఈమెను రిసీవ్ చేసుకుంటారు? అనేది ప్రశ్న. ఎందుకంటే.. వరంగల్ హిస్టరీలో ఇప్పటి వరకు పెద్దగా జంపింగుల ను ఆదరించిన పరిస్తితి లేదు. ఇప్పుడు బీఆర్ ఎస్ పక్షాన కావ్యకు టికెట్ కూడా కన్ఫర్మ్ అయింది. దీనిని కూడా కాదని.. తాజాగా కాంగ్రెస్‌లోకి చేరారు.
అయితే.. ప్రజలు ఈ జంపింగులను సహించడం లేదన్నది వాస్తవం. పైగా.. కేవలం పదవులు ఆశించి.. పదవుల కోసం చేసే రాజకీయాలను వరంగల్ ప్రజలు ఇప్పటి వరకు ఆదరించారా? అనే ప్రశ్నే మిగులు తోంది. ఈ నేపథ్యంలో కావ్య గెలుపు అంత ఈజీ కాదనే అంటున్నారు పరిశీలకులు. అంతేకాదు.. ఎస్సీ వర్గాల్లోనూ ఈ కుటుంబం పరువు పోగొట్టుకుంటోందని అంటున్నారు. దీని నుంచి వ్యక్తిగతంగా కడియం ఫ్యామిలీ మరింత కోల్పోవడం ఖాయమనే వాదన కూడా వినిపిస్తోంది.