Political News

మంత్రి రోజాకు సెగ‌.. సొంత మ‌నుషుల నుంచే!

వైసీపీ ఫైర్ బ్రాండ్ నాయ‌కురాలు, మంత్రి రోజాకు సొంత నియోజ‌క‌వ‌ర్గంలో నిర‌స‌న సెగ భారీగా త‌గులుతోంది. న‌గరి నియోజక వర్గంలో ఐదు మండలాల వైసీపీ ఇంఛార్జులు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.

రోజా రాజకీయాల్లో ఐరన్ లెగ్ అంటూ రోజా వల్ల వైసీపీకే నష్టమంటూ విమర్శలు గుప్పిస్తున్నారు. అధికారంతో మంత్రి రోజా, ఆమె అన్నదమ్ములు కోట్ల రూపాయల అక్రమాస్తులు కూడబెట్టారని ఆరోపించారు. మా భిక్షతోనే మంత్రి రోజా రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారని కామెంట్స్ చేశారు. గ‌త ఎన్నిక‌ల‌కు ముందు అప్పుల్లో ఉన్న రోజా ఇప్పుడెలా వందలకోట్లు సంపాదించారని ప్రశ్నించారు.

నగరి నియోజకవర్గంలో భూకబ్జాలు, రౌడీయిజం, కమిషన్లు ఇలా ఒక్కటేమిటి.. రోజా లాంటి అవినీతి మంత్రిని ఇప్పటి వరకు ఎక్కడా చూడలేదని మండిపడ్డారు. మంత్రి రోజా అవినీతిపై బహిరంగ చర్చకు రావాలని సవాల్ విసిరారు. రోజా సోదరుల దోపిడికి అడ్డుగా ఉన్నామనే తమనే దూరం పెట్టారని వైసీపీ ఇంఛార్జులు ఆరోపిస్తున్నారు.

తాము అవినీతికి పాల్పడి ఉంటే ఆధారాలు చూపించాలని డిమాండ్ చేశారు. రోజాకు ఎట్టిపరిస్థితిలోనూ ఎమ్మెల్యే సీటు ఇవ్వొద్దని.. ముఖ్యమంత్రి సీఎం జగన్ ఈ విషయంపై ఒకసారి ఆలోచించాలని డిమాండ్ చేస్తున్నా. రోజాకు సీటు ఇస్తే నగరి నియోజకవర్గంలో గెలిచే ప్రసక్తే లేదని క‌రాఖండీగా చెప్పేస్తున్నారు.

రోజాకు కాకుండా ఎవరికి టికెట్ ఇచ్చినా వైసీపీ కోసం పనిచేస్తామని వ్యతిరేకవర్గం చెబుతుండ‌డం గ‌మ‌నార్హం. ఈ క్రమంలోనే రోజా భర్త సెల్వమణిపై ఆగ్రహం వ్యక్తం చేయ‌డంపైనా నిప్పులు చెరుగుతున్నారు. అసలు ఆమె భర్తకు వైసీపీ పార్టీతో సంబంధ మేంటిని ప్రశ్నించారు. సెల్వమణి ఈ రాష్ట్రానికి చెందిన వ్యక్తే కాదని.. అలాంటి వ్యక్తి త‌మ‌కు పార్టీలో పదవులు ఇవ్వడానికి ఎవరని నిలదీశారు. పోలింగ్ బూత్ లు ఎక్కడ ఉందో తెలియని సెల్వమణి కూడా మమ్మల్ని విమర్శించడం విడ్డూరమని చెప్పుకొచ్చారు.

ఇదిలావుంటే రోజా భ‌ర్త సెల్వ మ‌ణి చేసిన వ్యాఖ్య‌లు వివాదాన్ని మ‌రింత రాజేశాయి. రోజాకు తప్ప ఎవరికి ఇచ్చినా పని చేస్తామ‌నిమని మొరుగుతున్నారంటూ అస‌మ్మ‌తి నేత‌ల‌ను కుక్క‌ల‌తో పోల్చారు. అందరికీ రోజా సాయం చేశారన్నారు. నిండ్ర చక్రపాణి రెడ్డికి కూడా శ్రీశైలం బోర్డు చైర్మన్ పదవి ఇప్పించింది రోజానేనన్నారు. మురళీని జడ్పీటీసీని చేశామన్నారు. కేజే కుమార్ కు కూడా చెప్పామని.. తాము ఎటువంటి ద్రోహం ఎవరికీ చేయలదన్నారు. మొత్తానికి రోజాకు భారీ సెగ త‌గులుతుండ‌డం గ‌మ‌నార్హం.

This post was last modified on March 6, 2024 2:40 pm

Share

Recent Posts

ఆ రోడ్డుపై వైసీపీ దుష్ప్రచారం.. ఖండించిన డిప్యూటీ సీఎంవో

ఈ రోజుల్లో మంచి పని చేయడం ఎంత ముఖ్యమో...ఆ పనిపై జరిగే విషప్రచారాన్ని ఖండించడం కూడా అంతే ముఖ్యం. మరీ…

6 minutes ago

చీకట్లో మొబైల్‌ చూస్తున్నారా.. ఈ డేంజర్‌ గురించి తెలుసుకోండి..

రాత్రి నిద్రపోయే ముందు ఫోన్‌ చూడటం చాలామందికి అలవాటుగా మారిపోయింది. గదిలో లైట్లు ఆపేసిన తర్వాత కూడా మొబైల్‌ స్క్రీన్‌…

23 minutes ago

వెంకీ త్రివిక్రమ్ సినిమా స్థాయి బజ్ ఉందా?

సరిగ్గా ఇంకో పదకొండు రోజుల్లో ఆదర్శ కుటుంబం ఏకె 47 విడుదల కానుంది. సంక్రాంతికి వస్తున్నాం లాంటి మూడు వందల…

2 hours ago

పబ్లిక్ టాయిలెట్‌లో ఇద్దరు యువకులు మృతి… ఏం జరిగింది?

ముంబైలోని గోరేగావ్‌లో పబ్లిక్ టాయిలెట్‌కు వెళ్లిన ఇద్దరు యువకులు అక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఒకేసారి ఇద్దరు చనిపోవడంతో అసలు లోపల…

2 hours ago

అనుమానం రాకుండా అంతర్ధానం అవుతోంది

చిన్న సినిమాల్లో విషయం ఉంటే ఆదరణ దక్కి తీరుతుంది. ఈ విషయంలో తెలుగు ప్రేక్షకులు ఎప్పుడూ ముందుంటారు. సీతాకోకచిలుక నుంచి…

3 hours ago

జడలు విదిలించిన వసూళ్లు… ఇకపై అసలు సవాళ్లు

బుధవారం ప్రీమియర్లతో గురువారం విడుదల ఎంచుకున్న ది ప్యారడైజ్ ఎట్టకేలకు మొదటి వీకెండ్ విజయవంతంగా పూర్తి చేసుకుంది. ప్రాధమిక సమాచారం…

4 hours ago