టాలీవుడ్ యువ కథానాయకుడు విశ్వక్సేన్ ఒక సినిమాలో భాగం కావడం, కాకపోవడం గురించి తరచుగా చర్చ జరుగుతూ ఉంటుంది. ‘బేబి’ సినిమా కోసం అడిగితే దర్శకుడు సాయి రాజేష్‌తో అతను వ్యవహరించిన తీరు గురించి ఆ సినిమా రిలీజ్ టైంలో పెద్ద చర్చ జరిగింది. ఇక అర్జున్ దర్శకత్వంలో ఓ సినిమాకు ఓకే చెప్పి.. షూట్ మొదలయ్యాక దాన్నుంచి వైదొలగడం చర్చనీయాంశం అయింది. ఇప్పుడు విశ్వక్ మరో సినిమా నుంచి తప్పుకోవడం గురించి సోషల్ మీడియాలో చిన్న డిస్కషన్ నడుస్తోంది.
‘వాల్తేరు వీరయ్య’ దర్శకుడు బాబీ డైరెక్షన్లో బాలయ్య ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో ఓ ప్రత్యేక పాత్ర కోసం విశ్వక్సేన్ పేరును పరిశీలించినట్లు ఆ మధ్య వార్తలు వచ్చాయి. ఐతే తనను ఆ పాత్ర కోసం సంప్రదించిన మాట వాస్తవమే అని.. కానీ తాను ఆ పాత్ర చేయనని చెప్పానని విశ్వక్ తెలిపాడు.
బాలయ్య మీద విశ్వక్సేన్‌కు బాగానే అభిమానం ఉంది. వీళ్లిద్దరూ కలిసి కొన్ని వేడుకల్లో కనిపించారు కూడా. ఐతే బాలయ్య సినిమాలో తాను చేస్తే బాగా ప్రాధాన్యమున్న, ప్రత్యేకమైన పాత్రే చేయాలని అనుకున్నానని.. ఐతే తనకు ఆఫర్ చేసింది ఆ స్థాయి పాత్ర కాదు అనిపించడంతో బాబీ సినిమాలో చేయలేకపోయానని విశ్వక్ తెలిపాడు.
భవిష్యత్తులో బాలయ్యతో కలిసి నటిస్తానని అతను ఈ సందర్భంగా చెప్పాడు. విశ్వక్ హీరోగా నటించిన లాంగ్ డిలేయ్డ్ మూవీ ‘గామి’ ఈ శుక్రవారమే ప్రేక్షకుల ముందుకు వస్తున్న సంగతి తెలిసిందే. ఇది విశ్వక్ కెరీర్ ఆరంభంలో మొదలుపెట్టిన సినిమా. ఎన్నో కష్ట నష్టాలకు ఓర్చి ‘గామి’ టీం ఈ సినిమాను పూర్తి చేసింది. ఏకంగా ఆరేళ్లు ప్రొడక్షన్లో ఉన్న ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలే ఉన్నాయి. విద్యాధర్ కాగిత రూపొందించిన ఈ చిత్రం క్రౌడ్ ఫండింగ్‌తో తెరకెక్కగా.. చివర్లో యువి క్రియేషన్స్ సంస్థ ఈ చిత్రానికి అండగా నిలిచి రిలీజ్ చేస్తోంది.
This post was last modified on March 6, 2024 2:33 pm
ఒకే ఏడాది రెండు రిలీజులతో అభిమానులను ఖుషి చేసిన పవన్ కళ్యాణ్ అతి తక్కువ గ్యాప్ లో మూడో సినిమాతో…
రామాయణం నేపథ్యంలో ఇప్పటికే ఇండియాలో బహు భాషల్లో అనేక సినిమాలు వచ్చాయి. కానీ ఆ కథకు ఇప్పటికీ డిమాండ్ తక్కువేమీ…
కరుడుగట్టిన నేరస్తులకు దిమ్మ తిరిగేలా షాక్ ఇవ్వటమే కాదు.. తమకు ఎదురు లేదు.. తిరుగులేదన్నట్లుగా వ్యవహరిస్తూ.. అచ్చొచ్చిన అంబోతుల మాదిరి…
ఫ్యూచర్ సిటీలో సినీ స్టూడియోల నిర్మాణానికి ప్రభుత్వం సహకరిస్తుందని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు. నిర్మాతలు ఎవరైనా.. ఎక్కడి…
జాతీయ మీడియాపై వైసీపీకి అకస్మాత్తుగా ప్రేమ ఉప్పొంగిపోయింది. జాతీయ మీడియాలో వచ్చే పలు క్లిప్పింగులను వైసీపీ సోషల్ మీడియా అకౌంట్లలో…
బీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఆ పార్టీపై మాజీ ఎమ్మెల్సీ కవిత తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తున్న సంగతి తెలిసిందే.…