Movie News

చైతన్యకృష్ణ కొత్త సినిమా


నందమూరి ఫ్యామిలీ నుంచి కొంచెం లేటుగా హీరో అయిన నటుడు చైతన్యకృష్ణ. నందమూరి జయకృష్ణ తనయుడైన చైతన్య.. చాలా ఏళ్ల కిందటే ‘ధమ్’ అనే సినిమాలో ఓ క్యారెక్టర్ రోల్ చేశాడు. రిలీజైనపుడు ఆ సినిమాను ఎవ్వరూ పట్టించుకోలేదు కానీ.. చైతన్య లీడ్ రోల్ చేసిన కొత్త చిత్రం ‘బ్రీత్’ రిలీజ్ టైంలో ‘ధమ్’లోని సీన్లు వైరల్ అయ్యాయి. అందులో చైతన్య హావభావాల మీద విపరీతమైన ట్రోలింగ్ జరిగింది.

ఇక ‘బ్రీత్’ సినిమా ఎంత దారుణమైన ఫలితాన్నందుకుందో తెలిసిందే. ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా చైతన్య ఇచ్చిన ఇంటర్వ్యూల తాలూకు వీడియోలకు బాగానే వ్యూస్ వచ్చాయి కానీ.. ‘బ్రీత్’ సినిమాను మాత్రం థియేటర్లకు వెళ్లి జనం చూడలేదు. ఈ చిత్రం ఈ నెల 8న ఆహా ఓటీటీ ద్వారా డిజిటల్‌గా రిలీజ్ కానున్న సంగతి తెలిసిందే. ఇంతలో చైతన్యకృష్ణ కొత్త సినిమా గురించి కబురు బయటికి వచ్చింది.

చైతన్యకృష్ణ హీరోగా జీకే చౌదరి అనే కొత్త దర్శకుడు ఒక సినిమా తీయబోతున్నాడు. “నందమూరి చైౌతన్యకృష్ణ ఇన్ అండ్ యాజ్.. కొత్త సినిమా. వివరాలు త్వరలో” అని ఇన్నాళ్లు కో డైరెక్టర్‌గా పని చేసి ఇప్పుడు దర్శకుడిగా మారుతున్న జీకే చౌదరి సోషల్ మీడియాలో పోస్టు పెట్టాడు. బహుశా మరోసారి చైతన్యకృష్ణ తన సొంత సంస్థలోనే సినిమా చేస్తున్నట్లున్నాడు.

‘బ్రీత్’ రిజల్ట్ చూశాక అతణ్ని హీరోగా పెట్టి బయటి నిర్మాతలు సినిమా తీయడం కష్టమే. ‘బ్రీత్’ ప్రమోషన్ల టైంలోనే తాను ఇంకో మూడు సినిమాలను లైన్లో పెట్టినట్లు చైతన్యకృష్ణ వెల్లడించాడు. అందులో ఇప్పుడు ప్రకటించిన సినిమా ఒకటి కావచ్చు. ఇదిలా ఉండగా.. ‘బ్రీత్’ మూవీ ఓటీటీలోకి వస్తుండడంతో ఆ సినిమా థియేట్రికల్ రిలీజ్ టైంలో పండుగ చేసుకున్న ట్రోలర్స్.. ఈ నందమూరి హీరోను ఇంకో రౌండ్ ఆటాడుకోవడానికి రెడీ అవుతున్నారు.

This post was last modified on March 6, 2024 3:48 pm

Share

Recent Posts

వెంకీ త్రివిక్రమ్ సినిమా స్థాయి బజ్ ఉందా?

సరిగ్గా ఇంకో పదకొండు రోజుల్లో ఆదర్శ కుటుంబం ఏకె 47 విడుదల కానుంది. సంక్రాంతికి వస్తున్నాం లాంటి మూడు వందల…

48 minutes ago

పబ్లిక్ టాయిలెట్‌లో ఇద్దరు యువకులు మృతి… ఏం జరిగింది?

ముంబైలోని గోరేగావ్‌లో పబ్లిక్ టాయిలెట్‌కు వెళ్లిన ఇద్దరు యువకులు అక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఒకేసారి ఇద్దరు చనిపోవడంతో అసలు లోపల…

1 hour ago

అనుమానం రాకుండా అంతర్ధానం అవుతోంది

చిన్న సినిమాల్లో విషయం ఉంటే ఆదరణ దక్కి తీరుతుంది. ఈ విషయంలో తెలుగు ప్రేక్షకులు ఎప్పుడూ ముందుంటారు. సీతాకోకచిలుక నుంచి…

2 hours ago

జడలు విదిలించిన వసూళ్లు… ఇకపై అసలు సవాళ్లు

బుధవారం ప్రీమియర్లతో గురువారం విడుదల ఎంచుకున్న ది ప్యారడైజ్ ఎట్టకేలకు మొదటి వీకెండ్ విజయవంతంగా పూర్తి చేసుకుంది. ప్రాధమిక సమాచారం…

3 hours ago

అమ్మ చేతులు అడుక్కోకూడదు

తెలుగులో లెజెండరీ స్టేటస్ ఉన్న దర్శకుల్లో పూరి జగన్నాథ్ ఒకడు. బద్రి, ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం, ఇడియట్, అమ్మ నాన్న…

3 hours ago

యువకుడి చెంప ఛెళ్లుమనిపించిన మంత్రి

ఈ మధ్యకాలంలో కొందరు రాజకీయ నేతలు తమను తాము వేరే లెవల్లో ఊహించుకుంటున్నారు. ప్రజలు ఎన్నుకుంటేనే తాము ప్రజాప్రతినిధులుగా చలామణీ…

4 hours ago