పవన్ కళ్యాణ్ సోదరుడు, జనసేన ముఖ్య నేతల్లో ఒకరైన నాగబాబు సోషల్ మీడియాలో వేసే పంచ్‌ల గురించి కొత్తగా చెప్పాల్సిన పని లేదు. రాజకీయ ప్రత్యర్థుల మీద ఆయన వ్యంగ్యంగా స్పందించే తీరు, వేసే పంచ్‌లు జనసైనికులకు బాగా నచ్చుతుంటాయి. గత ఎన్నికలకు ముందు తెలుగుదేశం ఎమ్మెల్యే అయిన నటుడు నందమూరి బాలకృష్ణను ఆయన టార్గెట్ చేసుకున్న తీరు చర్చనీయాంశం అయింది.
ఐతే ఇప్పుడు జనసేన.. తెలుగుదేశంతో పొత్తుతో సాగుతోంది. రెండు పార్టీల ఉమ్మడి శత్రువు వైసీపీ అధినేత వైఎస్ జగనే. ఆయన ప్రతిసారీ పవన్ కళ్యాణ్ వ్యక్తిగత జీవితం మీద అభ్యంతరకర వ్యాఖ్యలు చేయడంపై ఎన్ని విమర్శలు ఎదురైనా తగ్గట్లేదు. దీంతో పవన్ ఈ విషయమై కొంచెం ఘాటుగానే స్పందించాడు. జగన్ ప్రతిసారీ తనకు నాలుగు పెళ్లిళ్లు జరిగినట్లు మాట్లాడుతుంటాడని.. లేని నాలుగో పెళ్లాం జగనేనా అని ‘జెండా’ సభలో వ్యాఖ్యానించడం కలకలం రేపింది.
దీని మీద నిన్నట్నుంచి సోషల్ మీడియాలో పెద్ద చర్చే నడుస్తోంది. ప్రతిసారీ పవన్ పెళ్లిళ్ల గురించి మాట్లాడే జగన్‌కు సరైన పంచ్ ఇచ్చాడని జనసైనికులు అభిప్రాయపడున్నారు. ఐతే ఈ విషయంలో వైసీపీ పెద్ద ఎత్తున ఎదురు దాడి చేస్తోంది. దానికి జనసైనికులు కూడా దీటుగా బదులిస్తున్నారు. ఈ క్రమంలో మీమ్స్ కూడా బాగా పేలుతున్నాయి. నాగబాబు ఈ సందర్భాన్ని ఉపయోగించుకుంటూ ‘వదిన’ అనే పాత సినిమా పోస్టర్ ఒకటి షేర్ చేసి అప్పట్లో తనకు బాగా నచ్చిన సినిమా అని పోస్ట్ పెట్టాడు. జగన్‌ను పవన్ తన నాలుగో పెళ్లాంగా అభివర్ణించిన నేపథ్యంలో పవన్‌ను అన్నగా భావించే జనసైనికులు జగన్‌ను వదినా వదినా అని సంబోధిస్తున్నారు. ఈ క్రమంలోనే నాగబాబు ఈ పోస్టర్ పెట్టి పంచ్ వేశాడు.
ఇదిలా ఉండగా.. ‘ఆపరేషన్ వాలెంటైన్’ ప్రి రిలీజ్ ఈవెంట్లో నాగబాబు మాట్లాడుతూ.. పోలీస్, ఫైటర్ పైలట్ లాంటి పాత్రలకు మంచి కటౌట్ ఉన్న తన కొడుకు వరుణ్ తేజ్ బాగా సూటవుతాడని చెబుతూ.. 5 అడుగుల 3 అంగుళాల ఎత్తున్న వాళ్లు పోలీస్ పాత్రలు చేస్తే బాగుండదని వ్యాఖ్యానించాడు. ఇది టాలీవుడ్లో హైట్ తక్కువ ఉన్న హీరోలకు పంచ్ అని సోషల్ మీడియాలో చర్చ జరగడంతో ఈ వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటున్నానని.. ఎవరినైనా నొప్పించి ఉంటే మన్నించాలని పేర్కొంటూ నాగబాబు మరో పోస్ట్ పెట్టడం గమనార్హం.
Gulte Telugu Telugu Political and Movie News Updates