ఎస్సీ నియోజకవర్గంలో లైన్ క్లియర్ అయినట్టు కనిపిస్తోంది. తాజాగా ప్రకటించిన టీడీపీ-జనసేన జాబితాను చూసిన తర్వాత.. ఎవరైనా ఇదే అనుకుంటారు. ఎందుకంటే.. టీడీపీ పలు నియోజకవర్గాల్లో సామాజిక సమీకరణలు మార్చేసింది. అదేసమయంలో యువతకు ప్రాధాన్యం ఇచ్చింది. దీంతో ఆయా నేతలు.. సామాజిక వర్గాలను బలంగా ఎదుర్కొనేలా టీడీపీ-జనసేనలు పెద్ద ఎత్తున కసరత్తు చేస్తాయని అందరూ అనుకున్నారు. ఉదాహరణకు సింగమనల ఎస్సీ నియోజకవర్గంలో ఆరోపణలు వచ్చాయనే వాదనలో సిట్టింగ్ ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతిని పక్కన పెట్టారు.
కానీ.. తాజాగా టీడీపీ ఇదే నియోజకవర్గంలో తీవ్ర అసమ్మతిని ఎదుర్కొంటున్న,గత ఎన్నికల్లో ఓడిపోయిన బండారు శ్రావణికే పట్టం కట్టింది. ఇక, కృష్ణాజిల్లా తిరువూరు ఎస్సీ నియోజకవర్గంలో సిట్టింగ్ ఎమ్మెల్యే రక్షణ నిధిని పక్కన పెట్టిన వైసీపీ… టీడీపీ నుంచి వచ్చిన.. నల్లగట్ల స్వామిదాసుకు ఛాన్స్ ఇచ్చింది. ఈయనకు వరుస పరాజయాలతో సింపతీ పెరిగిందనే టాక్ ఉంది. ఈ నేపథ్యంలో టీడీపీ అలెర్ట్ అయి.. స్థానికంగా ఇప్పటికే ఎంపిక చేసిన శ్యావల దేవదత్‌కు అవకాశం ఇచ్చి ఉంటే ఓ రేంజ్‌లో పోటీ ఉండేది.
కానీ, పొరుగు జిల్లా గుంటూరు నుంచి తీసుకువచ్చిన కొలిక పూడి శ్రీనివాసరావుకు ఇక్కడ అవకాశం ఇచ్చింది. ఈయన స్థానికేతరుడు. పైగా.. వేరే నియోజకవర్గం నుంచి వచ్చాడు. గత ఎన్నికల్లోనూ టీడీపీ ఇలాంటి ప్రయోగమే చేసింది. వేరే చోట ఉన్న జవహర్‌ను .. తన సొంత నియోజకవర్గమే అని చెప్పి.. తిరువూరు ఇచ్చింది. కానీ, ఆయన పరాజయం పాలయ్యారు. అయినా.. పాఠంనేర్చినట్టు కనిపించడం లేదు. చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరులో వైసీపి ముందు మార్చాలని చూసినా.. తర్వాత సిట్టింగ్ ఎమ్మెల్యే కమ్ మంత్రి.. నారాయణ స్వామికే టికెట్ ఇచ్చింది.
దీనిని గమనించి.. టీడీపీ వ్యూహాత్మకంగా అడుగులు వేయాల్సిన చోట కొత్తముఖాన్ని తీసుకువచ్చింది. ఇప్పటివరకు పార్టీ కోసం పనిచేసిన అనగంటి హరికృష్ణను పక్కన పెట్టి.. కొత్తగా డాక్టర్ థామస్‌ను ప్రకటించారు. ఇలా.. రాష్ట్ర వ్యాప్తంగా ఎస్సీనియోజకవర్గాల్లో తడబాట్లు స్పష్టంగా కనిపిస్తున్నాయి. మరి ఏమేరకు విజయం దక్కించుకుంటారో చూడాలి. ఇక, కీలకమైన నియోజకవర్గం పశ్చిమలోని కోవూరులో అసలు అభ్యర్థినే ప్రకటించలేదు. దీనిని మాజీ మంత్రిజవహర్ కోరుతున్నారు. మరి మలిజాబితాలో అయినా..ఆయనకు చోటు ఉంటుందో లేదో చూడాలి.
Gulte Telugu Telugu Political and Movie News Updates