మైలవరం వైసీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల్లో తాను పోటీ చేసే తీరతానని ఆయన చెప్పారు. అయితే.. అది వైసీపీ తరఫునా, లేదా? అనేది త్వరలోనే చెబుతానన్నారు. వచ్చే ఎన్నికల్లో పోటీ మాత్రం తప్పదని అన్నారు. ప్రస్తుతం వైసీపీ ఈయనను హోల్డ్‌లో పెట్టిన విషయం తెలిసిందే. ఎన్టీఆర్ జిల్లా పరిధిలోని తిరువూరు, విజయవాడ వెస్ట్, సెంట్రల్ వాటికి అభ్యర్థులను ఖరారు చేసింది.
కానీ, కీలకమైన మైలవరం సీటు విషయంలో మాత్రం వైసీపీ తర్జన భర్జన పడుతోంది. ఈ సీటు విషయంపై తేల్చాలని ఎమ్మెల్యే వసంత కోరుతున్నా.. దీనిపై క్లారిటీ ఇంకా ఇవ్వలేదు. మరోవైపు.. తనను తప్పిస్తారని.. వేరే వారికి టికెట్ ఇస్తారని పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. తాజాగా ఈ విషయంపై స్పందించి వసంత కృష్ణ ప్రసాద్.. వచ్చే ఎన్నికల్లో తాను పోటీ చేసే తీరతానని అన్నారు. అయితే.. అది వైసీపీనా, కాదా? అనేది త్వరలోనే చెబుతానని వ్యాఖ్యానించారు.
ప్రస్తుతం వైసీపీ ప్రభుత్వం సంక్షేమాన్ని అందిస్తోందని వసంత చెప్పారు. దాదాపు వంద శాతం మందికి ఈ సంక్షేమం అందుతోందని.. ఒకరిద్దరికి అందకపోయినా.. అది టెక్నికల్ సమస్యేనని చెప్పారు. అయినప్ప టికీ.. ప్రజలు అభివృద్దిని కోరుకుంటున్నారని తెలిపారు. ప్రస్తుతం జీ.కొండూరు మండలంలో అభివృద్ధి పనులు జరుగుతున్నాయన్నారు. కొన్ని సమస్యలు ఉన్నాయని.. వాటిని కూడా త్వరలోనే పరిష్కారం చేస్తామని చెప్పారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates