ఆ రెండు సీట్లు మాత్రం మాకే కావాలంటున్న పవన్

రాబోయే ఎన్నికల్లో కచ్చితంగా గెలవాలని అనుకుంటున్న రెండు నగరాల్లోని నియోజకవర్గాలపై జనసేన అధినేత కన్నేసినట్లు సమాచారం. ఇంతకీ ఆ నియోజకవర్గాలు ఏవంటే గుంటూరు పశ్చిమం, విజయవాడలో ఒకసీటని తెలిసింది. విజయవాడలో మూడు అసెంబ్లీ నియోజకవర్గాలున్నాయి. విజయవాడ తూర్పులో టీడీపీ ఎంఎల్ఏ గద్దె రామ్మోహన్ రావు ప్రాతినిధ్యం వహిస్తుండగా, విజయవాడ సెంట్రల్, పశ్చిమంలో వైసీపీ ఎంఎల్ఏలు వెల్లంపల్లి శ్రీనివాసరావు, మల్లాది విష్ణులున్నారు.

వీటిల్లో తూర్పు నియోజకవర్గాన్ని వదిలేస్తే విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం లేదా పశ్చిమంలో కచ్చితంగా జనసేన గెలిచితీరాలని పవన్ పట్టుదలగా ఉన్నారట. అయితే సెంట్రల్ నియోజకవర్గంలో టీడీపీ మాజీ ఎంఎల్ఏ బోండా ఉమ మళ్ళీ పోటీకి రెడీ అవుతున్నారు. కాబట్టి ఇక్కడ నుండి జనసేనకు టికెట్ దక్కుతుందా అనే అనుమానాలు పెరిగిపోతున్నాయి. ఇదే సమయంలో విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో టీడీపీ మాజీ ఎంఎల్సీ బుద్దా వెంకన్న అండ్ కో రెడీ అవుతున్నారు. కాబట్టి ఇక్కడ కూడా టికెట్ అనుమానమే.

అయితే ఏదో కారణాలు చెప్పి రెండు నియోజకవర్గాల్లో టికెట్లు కుదరదని టీడీపీ అంటే కుదరదని పవన్ ఇప్పటికే చంద్రబాబునాయుడు చెప్పినట్లు జనసేన వర్గాలు చెప్పాయి. మూడుసీట్లలో కచ్చితంగా ఒక సీటు ఇచ్చి తీరాల్పిందే అని పవన్ చెప్పేశారట. దాంతో టీడీపీకి ఏ నియోజకవర్గంలో కోతపడుతుందో అర్ధంకావటంలేదు. ఈ విషయం ఇలాగుండగానే గుంటూరులోని రెండు తూర్పు, పశ్చిమ నియోజకవర్గాల్లో కచ్చితంగా ఒకదానిలో పోటీచేయాలని పవన్ పట్టుదలగా ఉన్నారు. గుంటూరు నగర అధ్యక్షుడు నేరెళ్ళ సురేష్ తో ప్రత్యేకంగా పవన్ సుదీర్ఘంగా భేటీ అయ్యారు.

గుంటూరు నగరంలోని రెండు నియోజకవర్గాల్లో పార్టీ పరిస్ధితిని అడిగి తెలుసుకున్నారు. సామాజికవర్గాలు, పార్టీల బలాబలాలు జనాల్లో వైసీపీ ప్రభుత్వంపై ఉన్న అభిప్రాయాలు తదితరాలను అడిగి తెలుసుకున్నారు. ఇప్పటికే పై నియోజకవర్గాలపై పవన్ ఒకటికి రెండుసార్లు సర్వేలు చేయించి రిపోర్టులు తెప్పించుకున్నారు. కాబట్టి ఆ రిపోర్టులను దగ్గర పెట్టుకునే స్ధానిక నేతలతో సమావేశాలు నిర్వహిస్తు ఫీడ్ బ్యాక్ తెప్పించుకుంటున్నారు. పోటీచేయబోయే నియోజకవర్గాలను పవన్ అడుగుతారు సరే మరి చంద్రబాబు ఎలా స్పందిస్తారన్నది ఆసక్తిగా మారింది.