“రాష్ట్రంలో మరోసారి జగనే రావాలి. ఆయన పాలన చాలా బాగుంది. క్రైస్తవుల పాలనలో రాష్ట్రం సుభిక్షంగా ఉంది. ప్రజలు ఎన్నో ప్రయోజనాలు పొందుతున్నారు. కాబట్టి క్రైస్తవుడైన జగన్ మరోసారి ముఖ్యమంత్రి కావాలని మనమంతా కోరుకుందాం. మాజీ మంత్రి కన్నబాబు వంటి వారు కూడా.. క్రైస్తవుడైన జగనే సీఎం కావాలని కోరుకుంటున్నారు” -అని తూర్పుగోదావరి జిల్లా కాకినాడ సిటీ ఎమ్మెల్యే ఫైర్ బ్రాండ్.. ద్వారంపూడి చంద్రశేఖరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.
తాజాగా ఈ నియోజకవర్గంలో నిర్వహించిన సామాజిక సాధికార బస్సు యాత్రలో మాజీ మంత్రి కన్నబాబు.. సహా పలువురు నాయకులు పాల్గొన్నారు. ఈ క్రమంలో ద్వారంపూడి మాట్లాడుతూ.. సీఎం జగన్ పాలనను ఆకాశానికి ఎత్తేశారు. అదేసమయంలో పనీపాటా లేక కొందరు పాదయాత్రలు చేస్తున్నారని.. వారివల్ల.. ప్రయోజనం లేదని.. వారికి వ్యక్తిగత ఆరోగ్యం మాత్రమే బాగుపడుతుందని పరోక్షంగా నారా లోకేష్‌పై విమర్శలు గుప్పించారు.
ఇక, కాపులు అందరూ ఐక్యంగా ఉండాలని.. జగన్‌ను మరోసారి గెలిపించుకోవాలని ద్వారంపూడి పిలుపుని చ్చారు. ఎవరో ఏదో చెప్పారు.. ఏదో అన్నారు.. అని మనసులో పెట్టుకోవద్దు. వాళ్లంతా యాక్టర్లు. ఇప్పుడుంటారు.. రేపు సినిమాలకు వెళ్లిపోతారు. రాష్ట్రంలో ఉండేది మనం. మనకు జగన్ మంచి పాలన అందిస్తు న్నారు. ప్రభువు మాదిరిగా ఆయన శాంతి కోరుకుంటున్నారు. అన్ని వర్గాల సంక్షేమాన్ని కోరుతున్నారు కాబట్టి.. క్రైస్తవుడైన జగన్‌ను మరోసారి గెలిపించుకోవాలని ద్వారంపూడి వ్యాఖ్యానించడం సంచలనంగా మారింది.
Gulte Telugu Telugu Political and Movie News Updates