మంత్రాల‌ను న‌మ్ముకున్న ష‌ర్మిల‌?

Sharmila

అదేంటి.. అనుకుంటున్నారా? అవును. నిజ‌మే. వైఎస్సార్‌ తెలంగాణ పార్టీ(వైటీపీ) అధ్య‌క్షురాలువైఎస్ ష‌ర్మిల ప్ర‌జ‌ల‌ను ప‌క్క‌న పెట్టి.. ఇప్పుడు కీల‌క‌మైన తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌ల స‌మ‌యంలో మంత్రాల‌ను న‌మ్ముకున్నారు. పార్టీ ప‌రిస్థితి ఏంటి? ఎన్నిక‌ల్లో ఎన్నిసీట్లు గెలుస్తుంది? అభ్య‌ర్థుల‌కు బీఫాంలు ఎప్పుడు ఏ ముహూర్తంలో ఇవ్వాలి? వంటి అనేక అంశాల‌పై ఆమె సిద్ధాంతుల‌ను న‌మ్ముకున్న‌ట్టు స్ప‌ష్టంగా తెలుస్తోం ది.

ష‌ర్మిల మాతృమూర్తి వైఎస్ విజ‌య‌మ్మ తాజాగా ఒంగోలు స‌మీపంలోని ప్ర‌ముఖ సిద్ధాంతిని క‌లిసి.. వైఎస్సా ర్ కాంగ్రెస్ పార్టీ భ‌విత‌వ్యం, అభ్య‌ర్థుల‌కు బీఫాంలు ఇచ్చే అంశాల‌పై జాత‌కాలు అడిగి తెలుసుకున్నారు. సుమారు మూడు గంట‌ల‌పాటు ఆమె స‌ద‌రు సిద్ధాంతితో చ‌ర్చ‌లు జ‌రిపి హైద‌రాబాద్కు చేరుకున్నారు. ఈ ప‌రిణామాల‌పై రాజ‌కీయ నేత‌ల మ‌ధ్య‌ ఆస‌క్తికర చ‌ర్చ సాగుతోంది. రాజ‌కీయాల్లో ఉన్న వైఎస్ కుటుంబం సిద్ధాంతులు, మఠాల‌ను న‌మ్ముకుని ముందుకు సాగుతోంద‌నే కామెంట్లు వినిపిస్తున్నాయి.

ఏపీలో సీఎం జ‌గ‌న్ విశాఖ శార‌దా పీఠాన్ని న‌మ్ముకున్న విష‌యాన్ని ఈ సంద‌ర్భంగా ప‌లువురు గుర్తు చేస్తున్నారు. 2019 ఎన్నిక‌ల‌కు ముందు ఆయ‌న పీఠాన్ని సంద‌ర్శించి.. అక్క‌డే అభ్య‌ర్థుల విష‌యాన్ని పీఠాధిప‌తి స్వ‌రూపానందేంద్ర స్వామితో చ‌ర్చించారు. అలాగే.. తొలిసారి సొంత పార్టీతో అసెంబ్లీ ఎన్నిక‌ల‌కు వెళ్తున్న ష‌ర్మిల కూడా స్వాములు, మంత్రుల‌ను న‌మ్ముకున్నార‌ని.. పోలింగ్ యంత్రాల‌ను ఏమేర‌కు క‌దిలించ‌గ‌లుగుతారో చూడాలని మ‌రికొంద‌రు అంటున్నారు. మొత్తంగా ష‌ర్మిల-సిద్ధాంతుల వ్య‌వ‌హారం తెలంగాణ‌లోనే కాకుండా ఏపీలోనూ ఆస‌క్తిగా మారింది.