తెలుగుదేశంపార్టీ-జనసేన పార్టీల్లో సమన్వయ కమిటి ఏర్పాటైంది. రెండుపార్టీల నుండి చెరో ఆరుమంది నేతలు ఈ కమిటిలో ఉంటారు. టీడీపీ తరపున సీనియర్ నేత యనమల రామకృష్ణుడు, జనసేన తరపున నాదెండ్ల మనోహర్ నాయకత్వం వహిస్తారు. జనసేన తరపున ఆరుగురు నేతలు ఎవరో కూడా పవన్ ఇతవరకే ప్రకటించేశారు. యనమల నాయకత్వంలో టీడీపీలోని నేతలు ఎవరో తెలాలంతే. టీడీపీ నుండి కూడా కమిటి ఏర్పాటవ్వగానే తొందరలోనే రెండుపార్టీల తరపున ఏర్పాటవ్వబోయే కమిటి సమావేశం అవటానికి రెడీగా ఉంది.
రాబోయే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా రెండుపార్టీలు కలిసి సమన్వయ కమిటిని ఏర్పాటుచేసుకున్నాయి. ఈ కమిటి ముందుగా మ్యానిఫెస్టోపై దృష్టిపెట్టబోతోంది. ఎందుకంటే చంద్రబాబునాయుడు, పవన్ కల్యాణ్ ఎవరికి వాళ్ళుగా రకరకాల హామీలను ఇచ్చేసున్నారు. రాజమండ్రిలో జరిగిన మహానాడులో చంద్రబాబు మినీ మ్యానిఫెస్టోను కూడా ప్రకటించారు. దీనికి సూపర్ సిక్స్ గా ప్రచారం చేస్తున్నారు.
అలాగే పవన్ కూడా షణ్ముక వ్యూహం పేరుతో ఎనిమిది కీలక హామీలను ప్రకటించేశారు. అయితే తాజా రాజకీయ పరిణామాల్లో రెండుపార్టీలు కలిసి పోటీచేయాలని డిసైడ్ అయ్యాయి. అందుకనే ఉమ్మడి మ్యానిఫెస్టో అవసరమైంది. దానిపై వర్కవుట్ చేయటంతో పాటు వైసీపీకి వ్యతిరేకంగా ఉమ్మడి కార్యాచరణ డిసైడ్ చేయటానికి కూడా సమన్వయ కమిటి భేటీ అవబోతోంది. టికెట్ల విషయం కమిటీకి సంబంధంలేదు. ఈ విషయాన్ని చంద్రబాబు, పవన్ డిసైడ్ చేస్తారు. మిగిలిన విషయాలను మాత్రమే వాళ్ళ ఆదేశాలతో సమన్వయ కమిటి చర్చించి నిర్ణయం తీసుకుంటుంది.
రాజమండ్రి జైలులో ఉన్న చంద్రబాబును శుక్రవారం నారా లోకేష్, భువనేశ్వరి, బ్రాహ్మణి కలిశారు. బహుశా సమన్వయకమిటి సభ్యులతో పాటు పార్టీ కార్యాచరణపై చంద్రబాబు సూచనలు చేసుంటారని పార్టీనేతలు అనుకుంటున్నారు. పార్టీ చేపట్టాల్సిన కార్యక్రమాలను కూడా చంద్రబాబు నేతలకు ములాఖత్ సందర్భంగా కొన్ని సూచనలు చేస్తున్నారు. కాబట్టి వైసీపీకి వ్యతిరేకంగా తొందరలోనే ఉమ్మడి కార్యాచరణ మొదలవుతుందని అనుకుంటున్నారు. అంటే మ్యానిఫెస్టో చర్చలు ఒకవైపు చేస్తునే మరోవైపు ఉమ్మడి ఆందోళనలను మొదలుపెట్టేందుకు రెండుపార్టీలు ఆలోచిస్తున్నాయి. ఏ సంగతి తొందరలోనే నిర్ణయమవుతుంది.