రాబోయే ఎన్నికల విషయమై కేసీయార్ కీలకమైన నిర్ణయం తీసుకున్నారు. అదేమిటంటే ఎన్నికల షెడ్యూల్ ప్రకటించేలోగా ఎంఎల్ఏలు, అభ్యర్ధులతో సమావేశమవ్వాలని. కనీసం రెండుసార్లయినా మీటింగులు పెట్టుకోవాలని కేసీయార్ అనుకున్నట్లు పార్టీవర్గాల టాక్. ఎన్నికల్లో గెలుపుకు అనుసరించాల్సిన వ్యూహాలు, అభ్యర్ధులు చేయాల్సిన ఖర్చులు, ప్రచారం చేసుకోవాల్సిన పద్దతి, అసంతృప్త నేతలను బుజ్జగించటం, ద్వితీయ శ్రేణినేతలు, క్యాడర్ ను లైనులో పెట్టుకోవటం తదితర అంశాలపై క్షుణ్ణంగా చర్చించాలని అనుకున్నారట.
ఎంఎల్ఏలు, అభ్యర్ధులపై జనాల్లో ఉన్న నెగిటివ్ ను ఎలా పోగొట్టుకోవాలనే విషయమై కేసీయార్ అందరితోను ముఖాముఖి చర్చలు జరపాలని అనుకున్నారు. పై అంశాలపై ఎంఎల్ఏలు, అభ్యర్ధులకు స్పష్టమైన గైడ్ లైన్స్ రెడీ చేయాలని కేసీయార్ డిసైడ్ అయ్యారు. అందరితో మాట్లాడిన తర్వాత బలహీనంగా ఉన్న అభ్యర్ధుల జాబితాను రెడీచేయబోతున్నారు. ఏ నియోజకవర్గాల్లో పార్టీ బలంగా ఉంది ? ముందుగా తాను దృష్టిపెట్టాల్సిన నియోజకవర్గాలు ఏవి అనే విషయాలను కేసీయార్ స్టడీ చేయబోతున్నారు.
ఎంఎల్ఏలు, అభ్యర్ధులతో మీటింగులు అయిన తర్వాత ఒక్కో నియోజకవర్గాన్ని ఒక్కో యూనిట్ గా తీసుకుని డీటైల్డ్ గా చర్చించాలని డిసైడ్ అయ్యారు. దానివల్ల తొందరలో బహిరంగసభలు పెట్టుకోవాల్సిన నియోజకవర్గాలు ఏవి ? ఎన్ని మీటింగులు పెట్టుకోవాలనే విషయంలో కేసీయార్ కు ఒక క్లారిటి రాబోతోంది. గతంలో అయితే ప్రతి నియోజకవర్గంలోను ఒక బహిరంగసభ పెట్టుకోవాలని అనుకున్నారు. అయితే ప్రత్యేక పార్లమెంట్ సమావేశాలు అని నరేంద్రమోడీ అనగానే కేసీయార్ ఎక్కడికక్కడ వ్యవహారాలను నిలిపేశారు.
ఒక్కసారిగా మోడీ దెబ్బకు కేసీయార్ తల్లకిందులైపోయారు. అయితే అందరు అనుకున్నట్లు ప్రత్యేక పార్లమెంట్ సమావేశాల్లో ప్రచారం జరిగినట్లుగా పెద్దగా డెవలప్మెంట్లు లేకపోవటంతో దాదాపు 20 రోజులు పూర్తిగా వృధా అయిపోయింది. ఇది కేసీయార్ కు పెద్ద నష్టం జరిగింది. ఆ 20 రోజుల నష్టాన్ని ఇపుడు హడావుడిగా కేసీయార్ భర్తీ చేయాలని అనుకుంటున్నారు. అందుకనే ఎంఎల్ఏలు, అభ్యర్ధులతో సమావేశాలు పెట్టుకుని గేర్ అప్ చేయాలని కేసీయార్ తొందరపడుతున్నారు. మరి చివరకు ఏమవుతుందో చూడటం ఆసక్తిగా మారుతోంది.