ఇపుడీ విషయమే కాంగ్రెస్ పార్టీలో పెద్దఎత్తున చర్చ జరుగుతోంది. విషయం ఏమిటంటే కర్నాటక పీసీసీ అధ్యక్షుడు, ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్ తొందరలోనే కొంతకాలం హైదరాబాద్ కు మకాం మార్చబోతున్నారట. ఎందుకంటే తెలంగాణా పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కోరికమేరకేనట. రాబోయే ఎన్నికల్లో తొందరలోనే టికెట్లను ఫైనల్ చేయాలని ప్రదేశ్ ఎన్నికల కమిటి డిసైడ్ చేసిన విషయం తెలిసిందే. ఇందుకు వీలుగా ఆశావహుల నుండి దరఖాస్తులను కూడా పీసీసీ ఆహ్వానించింది.
119 నియోజకవర్గాలకు అనూహ్యంగా ఊహించనన్ని దరఖాస్తులు వచ్చేశాయి. 1010 దరఖాస్తులు రాగా వాటిని వడపోయటమే తలకుమించిన భారంగా తయారైంది. దాంతో కొంతకాలం హైదరాబాద్ లో మకాంవేసి క్యాండిడేట్లను ఫైనల్ చేయటంలో సహకారం, మార్గదర్శకత్వం చేయాలని డీకేని రేవంత్ కోరారు. ఇదే విషయమే రేవంత్ బెంగళూరు వెళ్ళి డీకేతో చాలాసేపు భేటీ అయ్యారు. రేవంత్ రిక్వెస్టుకు డీకే కూడా సానుకూలంగా స్పందించారు.
అంటే దరఖాస్తుల వడపోత, స్క్రీనింగ్, ఫైనలైజేషన్ అంతా డీకే సమక్షంలోనే జరగబోతోందని అర్ధమవుతోంది. ఎందుకంటే రేవంత్ ముందుజాగ్రత్తగా డీకేని ఇన్వాల్స్ చేస్తున్నారని అర్ధమవుతోంది. లెక్కకుమించిన దరఖాస్తులు వచ్చినపుడు వడపోయటం, ఫైనల్ చేయటం ఎవరికైనా కష్టమే. రేవంత్ ఆ పనిచేస్తే సీనియర్లు, టికెట్లు దక్కనివారు రేవంత్ ను టార్గెట్ చేయటం ఖాయం. దాని ప్రభావం రాబోయే ఎన్నికలపైన కచ్చితంగా పడుతుంది.
రేవంత్ చెప్పినదానికి అధిష్టానం వ్యతిరేకంగా నడుచుకునే అవకాశాలు కూడా ఉన్నాయి. అప్పుడు రేవంత్ ఇజ్జతంతా పోతుంది. అందుకనే ముందుజాగ్రత్తగా డీకేని రేవంత్ ఇన్వాల్వ్ చేస్తున్నది. డీకే సమక్షంలోనే దరఖాస్తులను ఫైనల్ చేసి అభ్యర్ధులను ఎంపికచేస్తే ఎవరు కూడా రేవంత్ ను టార్గెట్ చేయటానికి ఉండదు. ఎందుకంటే సోనియా, రాహుల్, ప్రియాంకతో పాటు జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అత్యంత సన్నిహితుడు. అభ్యర్ధుల ఎంపికలో రేవంత్ పై తెలంగాణా సీనియర్లలో ఎవరు ఫిర్యాదుచేసినా అధిష్టానం పట్టించుకోదు. ఎందుకంటే అభ్యర్ధులు ఫైనల్ అయ్యేది డీకే సమక్షంలోనే కాబట్టి. మొత్తానికి రేవంత్ కు ఎలాంటి ఇబ్బందులు రాకుండానే డీకే హైదరాబాద్ కు మకాం మార్చబోతున్నట్లు అర్ధమవుతోంది.
Gulte Telugu Telugu Political and Movie News Updates