టీడీపీ నేతల పై కేసులు పెట్టడం పై టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేశ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. గన్నవరం సభలో రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారని నారా లోకేశ్ కు కూడా పోలీసులు నోటీసులు జారీ చేశారు.
రెచ్చగొట్టే వ్యాఖ్యలంటే గతంలో చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు జగన్ చేసిన వ్యాఖ్యలని అన్నారు. చంద్రబాబును కాల్చి చంపాలని, ఉరి వేయాలని, చీపుర్లతో తరమాలని, కాలర్ పట్టుకుని నిలదీయాలని జగన్ విద్వేషపూరిత ప్రసంగాలు చేశారని… రెచ్చగొట్టే వ్యాఖ్యలంటే అవి అని చెప్పారు.
గన్నవరం యువగళం సభలో తాను, తమ టీడీపీ నేతలు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశామంటూ పోలీసులు పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారని మండిపడ్డారు.
తన తల్లిని అవమానించిన వాళ్లు, మరొకరి తల్లిని అవమానించకుండా బుధ్ది చెపుతానని అనడం కూడా రెచ్చగొట్టే వ్యాఖ్యలు అవుతాయా? అని ప్రశ్నించారు. ప్రజాకంటక పాలకులను ప్రశ్నించే బాధ్యతను టీడీపీ తీసుకోవడం నేరం అవుతుందా? అని అడిగారు. .
Gulte Telugu Telugu Political and Movie News Updates