వ‌చ్చే 100 ఏళ్లు.. యువ‌త‌దే: చంద్ర‌బాబు .. విజ‌న్ డాక్యుమెంట్

ఏపీ మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్ర‌బాబు నాయుడు తాజాగా 2047 విజ‌న్ డాక్యుమెంటును విడుద‌ల చేశారు. వ‌చ్చే 25 సంవ‌త్స‌రాల పాటు ఏం చేస్తే.. ఈ రాష్ట్రం డెవ‌ల‌ప్ అవుతుంది? ఉపాధి, వ‌న‌రులు పెరుగుతాయి? అనే కీల‌క విష‌యాల‌ను ఆయ‌న వెల్ల‌డించారు. విశాఖ‌లో మంగ‌ళ‌వారం రాత్రి జ‌రిగిన కార్య‌క్ర‌మంలో చంద్ర‌బాబు పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న విజ‌న్‌-2047 డాక్యుమెంట్‌ను రిలీజ్ చేశారు. ఈ సంద‌ర్భంగా డాక్యుమెంటులోని కీల‌క విష‌యాల‌ను చంద్ర‌బాబు వివ‌రించారు.

ప్రపంచాన్ని జయించే శక్తి తెలుగు జాతికి ఉందని చంద్ర‌బాబు అన్నారు. ఏపీని మరలా గాడిలో పెట్టాలనే ఉద్దేశంతోనే విశాఖ‌కు వ‌చ్చిన‌ట్టు తెలిపారు. పేదరికం లేని సమాజం చూడాలనేది త‌న స్వ‌ప్న‌మ‌ని వ్యాఖ్యానించారు. దేశంలో ప్రముఖపాత్ర యువకులదేనన్నారు. విజన్ డాక్యుమెంట్ 2047 ను ఆవిష్కరించడం త‌న పూర్వజన్మ సుకృతంగా చంద్ర‌బాబు పేర్కొన్నారు. రాష్ట్రాన్ని ప్రపంచ పటంలో నిలబెట్టాలనే ఉద్దేశంతోనే తాను విజన్ డాక్యుమెంట్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టామ‌న్నారు.

2047లో కీల‌క విష‌యాలు..

  • అవినీతి ఇంకా పోలేదు. నేరాలు ఎక్కువయ్యాయి. ఈ రెండిటిని అదుపు చేస్తే అభివృద్ధి పథంలో నడిపించవచ్చు.
  • ఆర్థిక సంస్కరణల వల్ల సంపద సృష్టించబడింది. కానీ సంపద కొంతమంది దగ్గరే కేంద్రీకృతం అయింది.
  • రానున్న 100 సంవత్సరాలు యువతదే.
  • తెలుగు వారి అభివృద్ధి కోసం నిరంతరం తెలుగుదేశం పార్టీ కృషి చేస్తుంది. తెలుగుదేశం పార్టీ తెలుగు వారిని రిప్రజెంట్ చేస్తుంది.
  • తెలుగు జాతి అన్ని రంగాలలో ముందు ఉండాలి.
  • రాష్ట్రానికి పరిశ్రమలను తీసుకువచ్చిన ఘనత తెలుగుదేశం పార్టీకి దక్కుతుంది.
  • ఒక దుర్మార్గుడు చేసిన పనికి అమరావతి బలైపోయింది.
  • విశాఖ వాసులు కూడా అమరావతి రాజధాని కావాలని కోరుకుంటున్నారు.