దురంధర్ దూకుడు… సరిపోని ఉస్తాద్ చప్పుడు

బహుశా ఇలాంటి వెరైటీ భారీ బాక్సాఫీస్ క్లాష్ గతంలో చూసి ఉండం. ఒక హిందీ మూవీతో తెలుగు సినిమా కాంపీట్ కావడం కొత్తేమీ కాకపోయినా ఏపీ తెలంగాణలో ఆధిపత్యం రివర్స్ లో ఉండటమే ఎవరూ ఊహించని పరిణామం. ఉస్తాద్ భగత్ సింగ్ టికెట్ రేట్ల పెంపుకి సంబంధించి ఆంధ్రప్రదేశ్ జిఓ వచ్చి రెండు రోజులయ్యింది. ఇప్పటికీ ఫుల్ లెన్త్ బుకింగ్స్ ఓపెన్ చేయలేదు. వైజాగ్ లాంటి మెయిన్ సెంటర్స్ పెట్టినా బుక్ మై షో ట్రెండింగ్ లో లేకపోవడం షాక్.

ఇంకోవైపు తెలంగాణకు సంబంధించి సుప్రీమ్ కోర్టు అనుకూలంగా తీర్పు ఇచ్చినా థియేటర్ అగ్రిమెంట్లు, గవర్నమెంట్ జిఓలు తెచ్చుకోవడంలో జరుగుతున్న ఆలస్యం వల్ల నైజామ్ టికెట్ల అమ్మకాలు ఇంకా మొదలు కాలేదు. ఇంకోవైపు దురంధర్ ది రివెంజ్ ర్యాంపేజ్ మాములుగా లేదు. హైదరాబాద్ మల్టీప్లెక్సుల ప్రీమియర్ షో టికెట్లు హాట్ కేకుల్లా అమ్ముడుపోతున్నాయి. మూడు వందలకు పైగా షోలు వేస్తున్నా సరిపోయేలా లేవు పరిస్థితి చూస్తుంటే.

అర్జెంట్ గా ఉస్తాద్ భగత్ సింగ్ గేరు మార్చాలి. ట్రైలర్ తో పెద్దగా పనైనట్టు కనిపించడం లేదు. అభిమానులకు బాగా నచ్చినా న్యూట్రల్ ఆడియన్స్ కి ఎక్కువ కనెక్ట్ కాలేదేమోననే డౌట్ వస్తోంది. ఓవర్సీస్ లో ఇంకా ఆరమిలియన్ టచ్ కాలేదు. సోషల్ మీడియా యాంటీ ఫ్యాన్స్ ఆల్రెడీ కామెంట్లు మొదలుపెట్టారు. సో వీలైనంత త్వరగా మైత్రి వేకప్ కాల్ అందుకుని అన్ని చోట్లా బుకింగ్స్ మొదలుపెట్టాలి. దీనికి ఓజి రేంజ్ హైప్ లేదనే వాస్తవాన్ని అంగీకరించి ఆ మేరకు స్ట్రాటజిక్ గా ముందుకు వెళ్ళాలి.

అభిమానులు టెన్షన్ పడుతున్న విషయం మరొకటుంది. కేవలం తొమ్మిది నెలల గ్యాప్ లో (2025 జూలై – 2026 మార్చ్) పవన్ కళ్యాణ్ మూడు సినిమాలు వచ్చేశాయి. తర్వాత పెద్ద బ్రేక్ ఉంటుంది. సురేందర్ రెడ్డి ఇంకా మొదలేపెట్టలేదు. సో అప్పటిదాకా సెలెబ్రేట్ చేసుకోవడానికి ఉస్తాద్ భగత్ సింగ్ ఓ రేంజ్ లో ఉండాలి. దానికి తగ్గట్టే ఓపెనింగ్స్, పబ్లిక్ టాక్, వసూళ్లు రావాలి. దురంధర్ రివెంజ్ టాక్ సోసోగా వస్తే టెన్షన్ తగ్గుతుంది. అలా కాదని పాజిటివ్ అయితే మాత్రం ఉస్తాద్ అంతకు మించి ఉందనిపించుకోవాల్సిందే.