ప్రజాశాంతి పార్టీ వ్యవస్థాపకులు, శాంతి దూతగా పేర్కొనే కిలారి ఆనందపాల్.. తాజాగా జనసేనపై సంచల న వ్యాఖ్యలు చేశారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నేతృత్వంలోని జనసేన పార్టీని అమ్మేయాలని బేరం పెట్టా రని.. ఏకంగా 5000 కోట్ల రూపాయలకు బీజేపీ అమ్మేయాలని భావించారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈ విషయంపై చిరంజీవి, పవన్ కళ్యాణ్ ఇద్దరూ చర్చించుకున్నారని కూడా ఆయన ఆరోపించారు.
విజయవాడలో తాజాగా పర్యటించిన పాల్.. ఇక్కడ ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ.. సంచలన వ్యాఖ్యలు చేయడం గమనార్హం. “నేను మొదటి నుంచి చెబుతూనే ఉన్నాను. తమ్ముడు పవన్ కళ్యాణ్‌కు పార్టీ నడపడం చేతకాదు. అందుకే జనసేనను బీజేపీలో కలిపేయాలని భావిస్తున్నారు. దీనికి సంబంధించి నా దగ్గర ఆధారాలు కూడా ఉన్నాయి. చిరంజీవి-పవన్ ఇద్దరూ కలిసి.. జనసేనను బీజేపీలో కలిపేయాలని చూస్తున్నారు. 5000 కోట్లకు అమ్మేయాలని చూస్తున్నారు“ అని పాల్ వ్యాఖ్యానించారు.
అంతేకాదు.. ఈ మొత్తం వ్యవహారం వెనుక.. గతంలో ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేయించిన చిరంజీవి బావమరిది అల్లు అరవింద్ కీలక పాత్ర పోషించారని పాల్ చెప్పుకొచ్చారు. జనసేనను ఎవరూ నమ్మొద్దని కూడా పాల్ పిలుపునిచ్చారు. “తమ్ముడు ప్రస్తుతం వారాహి యాత్రల కోసం చాలా కష్టపడుతున్నాడు.అయితే.. ఈ యాత్ర ఆయన కోసం అనుకుంటున్నారా? కాదు.. మోడీని మరోసారి ఢిల్లీలో గద్దె ఎక్కించేందుకు ప్రయత్నం చేస్తున్నాడు“ అని పాల్ అన్నారు.
ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వని, పోలవరం నిర్మించని, కడప ఉక్కు పరిశ్రమ కట్టించని.. మోడీకి పవన్ గులాం గిరీ చేస్తున్నాడు. ఆయనకు ఓటేయాలని మనకు చెబుతున్నాడు. అది వారాహి యాత్ర కాదు.. మోడీ కోసం చేసే యాత్ర. జనసేనకు ఒక్క ఓటేసినా మోడీకి ఓటేసినట్లే. కాబట్టి తమ్ముడు పవన్‌ను నమ్మొద్దు“ అని పాల్ వ్యాఖ్యానించారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates