పవన్ కళ్యాణ్ నేతృత్వంలోని జనసేన పార్టీ రాష్ట ప్రధాన కార్యదర్శి నాగబాబు.. రెండు కీలక విషయాలు చెప్పారు. ఈ రెండు కూడా ఆయన చెప్పినట్టు వాస్తవే. ఇందులో కల్పితం కానీ.. మెరమెచ్చు కానీ ఏమీ లేదు. 1) ఏ పార్టీకి లేనంత యువశక్తి జనసేనకు ఉంది. 2) అవినీతి రహిత వ్యక్తి కాబట్టి పవన్‌కు ఓటేయాలి. తాజాగా నాగబాబు ఈ రెండు విషయాలను కూడా బలంగా ప్రస్తావించారు.
అంతేకాదు.. రాబోయే రోజుల్లో ఈ విషయాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్లాలని కూడా ఆయన స్వీయ నిర్దేశం చేసుకున్నారు. ఇంత వరకు బాగానే ఉంది. నాగబాబు చెప్పిన అనేక విషయాల్లో ఈ రెండు కీలకాలే. అయితే.. అసలు సమస్య ఎక్కడ ఉందంటే.. వీటిని సాధించడంలోనే ఉందని అంటున్నారు పరిశీలకులు. ఎందుకంటే.. ఇప్పుడు కొత్తగా నాగబాబు కనిపెట్టినా.. కనిపెట్టకపోయినా.. జనసేనకు యువశక్తి ఉందనేది అందరికీ తెలిసిందే.
అయితే.. ఆ యువశక్తిని… అభిమానులు కావొచ్చు.మెగా అభిమానులు కావొచ్చు.. ఇలా ఎవరైనా కూడా.. జనసేనకు అండగానే ఉన్నారు. అయితే.. ఎన్నికల సమయానికి వీరిని ఓటు బ్యాంకుగా మార్చుకోవాలన్న వ్యూహమే లేకుండా పోతోందని అంటున్నారు పరిశీలకులు. ఎందుకంటే.. గత ఎన్నికల సమయంలోనూ పవన్‌ను సీఎంగా చూడాలని తపించిపోయిన.. అభిమాన గణం ఓటు బ్యాంకు విషయానికి వస్తేచేతులు ఎత్తేశారు.
ఈ నేపథ్యంలో యువతను.. యువశక్తిని ఓటు బ్యాంకుగా మలుచుకోవాల్సిన అవసరం ఇప్పుడు నాగబా బుపైనే ఉందని అంటున్నారు పరిశీలకులు. రెండో విషయానికి వస్తే.. అవినీతి రహిత వ్యక్తి అంటూ.. పవన్‌ను ఆకాశానికి ఎత్తేశారు. మంచిదే. దీనిని ఎవరూ కాదనరు. కానీ.. దీనిని బలంగా ప్రజల్లోకి తీసుకువెళ్లడమే కాదు.. తాను నిజాయితీగా ఉంటానని చెప్పడమే కాదు.. ప్రభుత్వ వ్యవస్థలను అవినీతి రహితంగా ఉంచుతానన్న ధీమా ప్రజలకు కల్పించాల్సి ఉంటుంది.
అది కనుక సక్సెస్ అయితే.. ప్రజల్లో నమ్మకం ఏర్పడుతుంది. దీనిని సాధించడం పైకి చెప్పినంత ఈజీ అయితే కాదు. సో.. నాగబాబు పూనుకొని ప్రజల్లో తిరిగి ప్రచారం చేస్తే… ఫలితం ఉంటుందని అంటున్నారు. మరి ఏం చేస్తారో చూడాలి.
Gulte Telugu Telugu Political and Movie News Updates