ఆయన నోట మాట వచ్చిందంటే.. ట్రంప్ ఓడిపోయినట్లేనట

Donald Trump

జ్యోతిష్యాన్ని కొందరు నమ్ముతారు.. మరికొందరు నమ్మరు. కానీ.. శాస్త్రీయంగా కొన్ని అంశాల ప్రాతిపదికన ఎన్నికల్లో ఎవరు గెలిచే అవకాశం ఉందని విశ్లేషించే వారు కొందరుంటారు. ఆ కోవలోకే వస్తారు అమెరికాకు చెందిన ప్రొఫెసర్ అలన్.

ఆయన ప్రత్యేకత ఏమంటే.. గడిచిన నలభై ఏళ్లుగా అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఎవరు గెలుస్తారో ఆయన ఇట్టే చెప్పేస్తారు. ఆయన నోటి నుంచి ఏదైనా అంచనా వెలువడిందంటే.. అది జరిగిపోతుందంతే. గడిచిన నలభై ఏళ్లుగా అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో గెలిచేదెవరో ముందే చెప్పేయటం.. ఆయన చెప్పినట్లే తుది ఫలితం రావటం ఇప్పటివరకు జరిగింది.

ఎక్కడిదాకానో ఎందుకు 2016లో హిల్లరీ క్లింటన్ మీద ట్రంప్ గెలుస్తారని ఆయన అంచనా వేశారు. ఆయన మాటల్ని చాలామంది పట్టించుకోలేదు. తుది ఫలితం ఏమైందో తెలిసిందే. అనూహ్యంగా అధ్యక్ష ఎన్నికల్లో విజయం సాధించిన ట్రంప్.. రెండోసారి అధ్యక్షుడిగా విజయం సాధించాలన్న పట్టుదలతో ఉన్నారు. ఇందుకోసం ఆయన విశ్వ ప్రయత్నాల్ని చేస్తున్నారు.

ఇదిలా ఉంటే.. ఆయనకు ప్రత్యర్థిగా నిలిచిన జో బైడెన్ బలమైన అభ్యర్థే అయినప్పటికీ.. ఆయన వయసు ఆయనకు పెద్ద అవసరోధంగా మారింది. ఈ విషయాన్ని గుర్తించిన జోబైడెన్ తాజాగా వ్యూహాత్మక నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇందులో భాగంగా భారత సంతతికి చెందిన కమలా హారీస్ ను ఉపాధ్యక్ష పదవికి ఎంపిక చేయటం ద్వారా తన చాణుక్యాన్ని ప్రదర్శించారు. ఇదిలా ఉంటే.. తాజాగా జరగనున్న అధ్యక్ష ఎన్నికల్లో ఈసారి ట్రంప్ కు ఓటమి తప్పదని స్పష్టం చేశారు ప్రొఫెసర్ అలాన్.

తాను వెల్లడించిన అంచనా పదమూడు సూత్రాల్ని ఆధారంగా చేసుకొని చెప్పానని.. ఇప్పటివరకు తాను చెప్పిన ఏ అంచనా కూడా తప్పలేదన్నారు. అలన్ నోటి నుంచి వచ్చిన తాజా అంచనా రిపబ్లికన్ల గుండెల్లో రైళ్లు పరిగెత్తేలా చేస్తున్నాయి. మరి.. ఈ అంచనాపై ట్రంప్ ఏ రీతిలో రియాక్టు అవుతారో చూడాలి.

All the Streaming/OTT Updates you ever want. In One Place!