వచ్చే ఎన్నికల్లో ఎలాంటి పొత్తులు లేకపోయినా.. తెలుగు దేశం పార్టీ సునాయాసంగా అధికారంలోకి వచ్చే అవకాశం ఉంటుందని మేధావులు అంచనా వేస్తున్నారు. ఎన్నికలకు సమయం చేరువ అవడంతో ఏ పార్టీ విజయం దక్కించుకుంటుంది..? ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది? ప్రస్తుతం ఉన్న అంచనాలు ఏంటి? అనేవి చర్చకు వస్తున్నాయి. ఈ క్రమంలో ప్రధానంగా ప్రతిపక్షం టీడీపీ పుంజుకుందనే వాదన బలంగా వినిపిస్తోంది.
గత ఎన్నికలను పరిశీలిస్తే.. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆ సమయంలో ఆయన నాయకులను కాదు.. తనను చూసి ఓట్లు వేయాలని.. తనను చూసి గెలిపించాలని పిలుపునిచ్చారు. అయితే.. అప్పట్లో ప్రజలు ఈ మాటలను వినిపించుకోలేదు. దీనికి కూడా కారణం ఉంది. స్థానికంగా నాయకుల పై తీవ్ర విమర్శలు వచ్చాయి. దీంతో టీడీపీ నేతలను ఓడించారనే చర్చ అప్పట్లో జోరుగా సాగింది.
అయితే.. ఇప్పుడు పరిస్థితి మారిందని అంటున్నారు మేధావులు. వచ్చే ఎన్నికల్లో నాయకులు కాకుండా.. పార్టీ అధినేతల చుట్టూ.. రాజకీయాలు.. ఓట్లు తిరిగేలా.. ప్రస్తుతం రాజకీయ పరిణామాలు మారాయని అంటున్నారు మేధావులు. వైసీపీ కూడా ఇదే కోరుకుంటుందా.. లేదా? అనేది పక్కన పెడితే.. ఈ సారి వైసీపీ నాయకులపై ఆధారపడింది. మీరే గెలిపించాలి.. అని సీఎం జగన్ పదే పదే తన నాయకులకు పిలుపునిస్తున్నారు.
దీంతో క్షేత్రస్థాయిలో అనుకూల పరిస్థితి ఉంటే.. వైసీపీ విజయం దక్కించుకునేందుకు అవకాశం ఉంటుంది. టీడీపీ పరిస్థితి దీనికి భిన్నంగా ఉంది. చంద్రబాబు నాయుడు 75 ఏళ్ల వయసులోనూ.. ప్రజల మధ్య తిరుగుతున్నారు. దీంతో వ్యక్తిగతంగా చంద్రబాబు ఇమేజ్ భారీగా పెరిగింది. అంతేకాదు.. ఆయన వల్లే రాష్ట్రం డెవలప్ అవుతుందనే మౌత్ పబ్లిసిటీ ఎక్కువగా జరుగుతోందని మేదావులు అంటున్నారు. దీంతో పొత్తులు లేకపోయినా.. ఆయన గెలుపు ఖాయమని అంటున్నారు.