ప్రముఖ సినీ నటుడు రజినీకాంత్ గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్నారు. ఎన్టీఆర్ శతజయంతి వేడుకల సభలో పాల్గొనేందుకు ఆయన రాగా, ఎన్టీఆర్ కుమారుడు, హీరో నందమూరి బాలకృష్ణ ఆయనకు ఘనస్వాగతం పలికారు.
ఈ రోజు సాయంత్రం విజయవాడలోని పోరంకి అనుమోలు గార్డెన్స్‌లో ఎన్టీఆర్ శతజయంతి అంకురార్పణ సభ జరగనుంది. తెలుగుదేశం అధినేత చంద్రబాబు ముఖ్యఅతిథిగా పాల్గొననున్నారు. ఎన్టీఆర్ చారిత్రక ప్రసంగాల పుస్తకాలను ఆవిష్కరించనున్నారు. ఈ సభలో రజినీకాంత్ పాల్గొంటున్నారు.
కాగా నందమూరి తారకరామారావు శత వసంతాలను పురస్కరించుకుని శతజయంతి ఉత్సవాల శంఖారావాన్ని నేడు విజయవాడ వేదికగా పూరించనున్నారు. మే 28న ఎన్టీఆర్ జన్మదినం సందర్భంగా నెలరోజుల పాటు 100 ప్రాంతాల్లో వందో పుట్టినరోజు వేడుకలు నిర్వహించనున్నారు.
విజయవాడ వేదికగా నిర్వహించే శత జయంతి ఉత్సవాల అంకురార్పణకు సూపర్ స్టార్ రజినీకాంత్ విశిష్ట అతిథిగా, తెలుగుదేశం అధినేత చంద్రబాబు ముఖ్యఅతిథిగా పాల్గొంటున్నారు. ఆ క్రమంలోనే రజినీకాంత్ ఇప్పటికే గన్నవరం చేరుకున్నారు. ఎన్టీఆర్ చారిత్రక ప్రసంగాల పుస్తకాలను రజినీకాంత్ ఆవిష్కరించనున్నారు.
కాగా.. ఏపీలో ఎన్నికల ఫీవర్ ఇప్పటికే మొదలవడంతో రాజకీయ వేడి కూడా తీవ్రంగా ఉంది. ఇలాంటి పరిస్థితులలో ఎన్టీఆర్ శతజయంతి వేడుకలకు రజినీకాంత్ రావడమనేది ఏపీలోని ఎన్టీఆర్ అభిమానులతో పాటు రజినీకాంత్ అభిమానులనూ సంతోషపెడుతోంది.