జారుడు బల్లలపై వైసీపీ నేతల విన్యాసాలు ఆగడం లేదు. క్షేత్రస్థాయిలో తమ పరిస్థితి ఏంటనేది తెలుసు కోకుండానే నాయకులు వ్యవహరిస్తున్న తీరు.. పార్టీకి..వ్యక్తిగతంగా నేతలకు కూడా ఇబ్బందిగానే మారు తోందని అంటున్నారు. ఉదాహరణకు నర్సీపట్నం, విజయవాడ సెంట్రల్, పాణ్యం, గుంటూరు వెస్ట్, ప్రత్తిపాడు, కొవ్వూరు ఇలా.. అనేక నియోజకవర్గాల్లో పార్టీ పరంగా బాగానే ఉన్నప్పటికీ.. వ్యక్తుల పరంగా మాత్రం తీవ్ర వ్యతిరేకత కనిపిస్తోంది.
నిజానికి పార్టీపరంగా వ్యతిరేకత ఉంటే.. అది వ్యక్తిగతంగా ఉన్న ఇమేజ్ ద్వారా పోగొట్టుకుని.. పార్టీపరంగా బలోపేతం కావాలనేది సీఎం జగన్ సహా వైసీపీ కీలక నాయకుల ఆలోచన. ఒకవేళ.. వ్యక్తిగతంగా ఏదైనా తేడా వస్తోందని తెలిస్తే..పార్టీపరంగా బలోపేతం కావాలనేది కూడా వ్యూహమే. ఈ రెండింటిలో సమయానికి, పరిస్థితులకు అనుకూలంగా వ్యవహరించాల్సిన నాయకులు.. ఇప్పుడు ఇక్కడే ట్రాక్ తప్పుతున్నారని అంటున్నారు పరిశీలకులు.
ఉదాహరణకు నర్సీపట్నం నియోజకవర్గంలో ప్రస్తుత ఎమ్మెల్యే పెట్ల ఉమా శంకర్ గణేష్‌కు వ్యక్తిగతంగా పరిస్థితి చాలా బ్యాడ్‌గా ఉందనే టాక్ వినిపిస్తోంది. టీడీపీ జోరు.. అయ్యన్న ఊపు వెరసి.. ఇక్కడ వైసీపీ ఎమ్మెల్యేకు మైనస్‌లు పడుతున్నాయి. దీనినిసరిచేసుకునే ప్రయత్నాలు సదరు ఎమ్మెల్యే చేయడం లేదనే టాక్ వినిపిస్తుండడం గమనార్హం. అదేవిధంగా విజయవాడ సెంట్రల్ లోనూఇదే తరహా వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.
మరీముఖ్యంగా కర్నూలులో సగం నియోజకవర్గాలు.. నేతల చేజారి పోతున్నాయనే టాక్ కొన్నాళ్లుగా విని పిస్తోంది. దీనికి కారణం.. నేతల వ్యక్తిగత వ్యవహార శైలేనన్నది.. పరిశీలకుల మాట. మరి ఇలాంటి పరిస్థి తిని అధిగమించి.. పార్టీ తరఫున అయినా.. తమ గ్రాఫ్ పెంచుకోవాలనే ధ్యాస నాయకుల్లో కనిపించకపో వడం గమనార్హం. అంతేకాదు.. కనీసం గడపగడపకు కానీ.. ఇతర కార్యక్రమాలను కానీ.. మనసు పెట్టి చేయకపోవడం.. అంతా సీఎం జగన్ చూసుకుంటారని భావిస్తుండడం వంటివి మరింతగా వీరి గ్రాఫ్‌ను దిగజారుస్తుండడం గమనార్హం.