వైసీపీ సర్కారుపై తరచుగా విమర్శలు చేస్తున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్.. తాజాగా ఇంటింటికీ స్టిక్క ర్ల పథకంపై తనదైన శైలిలో సటైర్లు గుప్పించారు. విశాఖ పట్నంలోని రుషి కొండ అక్రమతవ్వాలపై వైసీపీ సర్కారు ఇరుకునపడిన విషయం తెలిసిందే. దీనిని ప్రస్తావిస్తూ.. పవన్.. `ఆ రుషికొండ అక్రమాల ను కప్పి పుచ్చుకునేందుకు అక్కడ 151 అడుగుల స్టిక్కర్ వేయండి“ అని వ్యాఖ్యానించారు. చేసినా చేస్తారని.. అక్రమాలు కప్పించుకునేందుకు ప్రయత్నిస్తారని వ్యాఖ్యానించారు.
చెట్లు, కొండలను నరికివేయడం, తీరప్రాంతాలు, మడ అడవులను పాడు చేయడం అనేది వైసీపీ దుష్ట పాలకుల ముఖ్య లక్షణమని పవన్ విమర్శించారు. రిషికొండను ధ్వంసం చేయడంలో వైసీపీ ప్రభుత్వం నిబంధనలను ఉల్లంఘించిందని ఐదుగురు సభ్యుల నిపుణుల ప్యానెల్ నిర్ధారించిందని తెలిపారు. వైసీపీ ప్రభుత్వం సమాధానం చెబుతుందా లేక రిషికొండ గ్రీన్ మ్యాట్‌పై 151 అడుగుల స్టిక్కర్‌ను అంటిస్తారా? అని పవన్ నిలదీశారు.
ఇదిలావుంటే.. మా నమ్మకం నువ్వే జగన్ కార్యక్రమం కింద.. ఇంటింటికీ స్టిక్కర్‌లు అంటించే కార్యక్రమం పై పవన్ వరుసగా స్పందిస్తున్న విషయం తెలిసిందే. బలవంతంగా రుద్దుతున్నారని.. ఒక వ్యక్తిని బలవం తంగా ఒప్పించడం.. వారిపై బలమైన ఇష్టాన్ని ప్రయోగించడం వంటివి రాజ్యాంగ విరుద్ధమని పేర్కొన్నారు. స్వేచ్ఛ అనేది లేకుండా చేసి.. చేతులు కట్టేసి ఓటు వేయించుకునేందుకు వైసీపీ తెగబడుతుండడంపై ప్రజలు తిరుగుబాటు చేయాలని ఆయన పిలుపునిచ్చిన విషయం తెలిసిందే.
Gulte Telugu Telugu Political and Movie News Updates