వైసీపీ ప్రభుత్వంపై టీడీపీ ఆరోపణాస్త్రాల పదును పెంచింది. ఒక పక్క యువగళం ద్వారా నారా లోకేష్ దూసుకెళ్తున్నారు. మరో పక్క చంద్రబాబు, టీడీపీ క్లస్టర్ మీటింగ్‌లలో ఆరోపణలు సంధిస్తూ జగన్‌కు ఉక్కిరిబిక్కిరి చేస్తున్నారు.
ముఖ్యమంత్రి జగన్ రెడ్డికి టీడీపీ అధినేత చంద్రబాబు సెల్ఫీ చాలెంజ్ విసిరారు. నెల్లూరులో టీడీపీ హయాంలో కట్టిన వేలాది టిడ్కో ఇళ్ల వద్ద చంద్రబాబు సెల్ఫీ దిగారు. అవి తమ ప్రభుత్వ హాయాంలో పేదలకు కట్టిన వేలాది టిడ్కో ఇళ్లు అంటూ చంద్రబాబు ట్వీట్ చేశారు.
గతంలో తాము కట్టిన లక్షల ఇళ్లకు ఇవే సజీవ సాక్ష్యం అంటూ రాసుకొచ్చారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన నాలుగేళ్లలో కట్టిన ఇళ్లెన్ని? జగన్ కట్టిన ఇళ్లెక్కడ… జవాబు చెప్పగలడా? అంటూ చంద్రబాబు జగన్‌కు ట్యాగ్ చేస్తూ సెల్ఫీ ఫోటోతో ట్వీట్ చేశారు.
పాదయాత్రలో భాగంగా లోకేష్ తొలుత సెల్ఫీ ఛాలెంజ్ చేశారు. కియా పరశ్రమ దగ్గర సెల్ఫీ దిగి ఇది మేము చేసిన పనేనని వెల్లడించారు. ఇప్పుడు చంద్రబాబు కూడా సెల్ఫీ ఛాలెంజ్ చేసి జగన్‌పై వత్తిడి పెంచారు…
Gulte Telugu Telugu Political and Movie News Updates