వైసీపీ అధినేత సీఎం జగన్ తీసుకుంటున్న నిర్ణయాలు.. కొన్ని కొన్ని సార్లు సక్సెస్ కన్నావిఫలమవుతున్నాయనే చర్చ జోరుగా సాగుతోంది. ఇటీవల ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్ చేశారంటూ.. నలుగురు ఎమ్మెల్యేలపై వేటు వేశారు. అయితే.. ఈ నిర్ణయంతో వైసీపీ సాధించింది ఏమీ కనిపించడం లేదు. అదేసమయంలో సదరు ఎమ్మెల్యేలకు సింపతీ పెరిగిందనే వాదన బలంగా వినిపిస్తోంది.
కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డిని తీసుకుంటే.. గత ఏడాదికి ఇప్పటికీ ఆయన గ్రాఫ్ పెరిగింది. గత ఏడాదిఇదే సమయంలో ఆయన పర్యటనలకు వెళ్తే.. పెద్దగా రెస్పాన్స్ ఉండేదికాదు.. కానీ ఇప్పుడు ఆయన తమ గ్రామాలకు రావాలని.. తమ ప్రాంతాలకు రావాలని కోరుతున్నవారు పెరుగుతున్నారు. అదేసమయంలో పార్టీ నుంచి బయటకు వచ్చి మంచి పనిచేశారంటూ.. నెటిజన్లు కూడా ఆయనకు మద్దుతు తెలిపారు.
ఉండవల్లి శ్రీదేవి: అసలు.. వచ్చే ఎన్నికల్లో ఆమెకు టికెట్ ఇచ్చినా.. ఓడిపోతారని.. బలంగా నమ్మిన వైసీపీ.. ఎన్నికల వరకు ఆమె స్థానంలోఅలానే ఉంచేసి.. ఉంటే పరిస్థితి అలానే ఉండేది. కానీ, ఆమెను పార్టీ నుంచి బయటకు పంపించడం ద్వారా.. ఇప్పుడు సంపతీ పెరిగింది. ఏ పార్టీ తరఫున పోటీ చేసినా.. గెలిపిస్తామంటూ.. ఆమెకు ఇక్కడిప్రజలు చెబుతున్నారు.
మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి. కొన్నాళ్లు పార్టీకి , కార్యక్రమాలకు, నియోజకవర్గానికి కూడా దూరంగా ఉన్న ఆయన విషయంలో అసంతృప్తి పెరిగింది. గడపగడపకు కార్యక్రమాన్ని కూడా ఆయన లైట్ తీసుకున్నా రు. దీంతో నియోజకవర్గంంలో ఆయన మాట వినిపించడం మానేసింది. ఇలాంటి సమయంలో వైసీపీ తీసుకున్న నిర్ణయాన్ని ఆయన ప్రజల్లోకి బాగా తీసుకు వెళ్లారు. నేను పార్టీకోసం ఎంతో చేస్తే.. పార్టీ నాకు.. ఇంత సత్కారం చేసిందన్న వాదన వినిపించారు. ఇప్పుడు ఆయన కూడా సింపతీ రేసులో ముందున్నారు.
ఆనం రామనారాయణరెడ్డి విషయంలో సింపతీ ఎలా ఉన్నా.. ఆత్మకూరులోఆయన రావాలని కోరుతున్న వారు ఏడాది కాలంగా పెరుగుతున్నారు. గౌతంరెడ్డి మరణం తర్వాత.. ఆయన సోదరుడు గెలిచినా.. ఆనం వర్గం మాత్రం బలంగానే ఉంది. ఇప్పుడు దీనికి తోడు పార్టీ నుంచి సస్పెండ్ చేయడం.. పార్టీలో ఆయనను వెలివేసిన ట్టుగా వ్యవహరించడం వంటివి మరింతగా గ్రాఫ్ పెంచాయి. మరి వైసీపీ ఏం సాధించినట్టు?!
Gulte Telugu Telugu Political and Movie News Updates