టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ప్రారంభించిన యువగళం పాదయాత్ర 13వ రోజుకు చేరుకుంది. ఎక్కడికెళ్లినా జనం భారీ సంఖ్యలో తరలి వస్తున్నారు. లోకేష్ ప్రతి ఒక్కరినీ పలుకరిస్తూ క్షేమ సమాచారాలు విచారిస్తూ ముందుకు సాగుతున్నారు. స్థానికంగా ఉన్న సమస్యలు తెలుసుకుంటున్నారు.జగన్ పాలనలో రాష్ట్రం ఎలా అథోగతి పాలైందో వివరిస్తున్నారు.
జగన్ మోసపు రెడ్డి
లోకేష్ ఇప్పుడు పంచ్ డైలాగులు వదులుతున్నారు. తాజాగా జగన్మోహన్ రెడ్డి పేరు మార్చేసి జగన్ మోసపు రెడ్డి అని పెట్టేశారు. పేద, బడుగు, మధ్య తరగతి వర్గాలను ఎలా మోసగించారో వివరిస్తున్నారు. వైసీపీ వారి వైనాట్ 175 నినాదంపై కూడా లోకేష్ విమర్శలు గుప్పిస్తున్నారు. వైనాట్ వేతనాలు పెన్షన్లు, వైనాట్ స్కాలర్ ఫిపులు, వైనాట్ రోడ్లు ఇలా చెప్పుకుంటే బావుంటుందని లోకేష్ ప్రస్తావిస్తున్నారు.
అభిమానులతో సెల్ఫీలు
లోకేష్ బస చేసే క్యాంపు సైట్ నుంచి ఉదయం ఎనిమిది గంటల ప్రాంతంలో ఆయన పాదయాత్రకు బయలుదేరుతున్నారు. అంత కంటే ముందు తనను కలిసేందుకు వచ్చిన తెలుగుదేశం కార్యకర్తలతో ఆయన సెల్ఫీలు దిగుతున్నారు. బుధవారం ఉదయం దిగువమాసపల్లి క్యాంప్ సైట్ దగ్గర సెల్ఫీ విత్ లోకేష్ కార్యక్రమం జరిగింది. దాదాపు వెయ్యి మంది వచ్చి ఆయనతో సెల్ఫీలు దిగారు. ఇలా ప్రతీరోజు వెయ్యి మందికి పైగా వస్తున్నారని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. వచ్చిన వారిలో యువకులే ఎక్కువగా ఉండటం విశేషం. యువనేత ఆపాయ్యంగా పలుకరించడం, తానే సెల్ ఫోన్ పట్టుకుని ఫోటోలు తీయడంతో స్థానిక ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. లోకేష్ కు జనంలో పెరుగుతున్న ఆదరణకు ఇదో నిదర్శనమని పార్టీ వర్గాలు చెబుతున్నాయి…
Gulte Telugu Telugu Political and Movie News Updates