ప్రధాని నరేంద్ర మోడీ తన వ్యూహాలకు పదును పెంచారా? వచ్చే మేలో జరగనున్న కర్ణాటక ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఆయన రెండు తెలుగు రాష్ట్రాలుసహా.. దక్షిణాదిలో పాగా వేసేలా తన కార్యాచరణను రెడీ చేసుకున్నారా? అంటే.. ఔననే అంటున్నారు పరిశీలకులు. ఎందుకంటే.. ఇప్పుడు మోడీకి అత్యంత కీలకమైన సంవత్సరం నడుస్తోంది. 2024 ఎన్నికలకు ముందు జరుగుతున్న ఈ ఎన్నికలు ప్రతిష్టాత్మకం.
దీంతో మోడీ.. తాజాగా కర్ణాటకలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన రెండు కీలక విషయాలు ప్రస్తావించారు. ఒకటి ఎప్పుడూ చెప్పే డబుల్ ఇంజన్ కాగా.. మరొకటి.. ప్రత్యక్షంగా, పరోక్షంగా రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాల పై ఆయన కామెంట్లు చేశారు. ఒక రాష్ట్రం అప్పులు ఇవ్వట్లేదని తనను తిడుతోందని అన్నారు. మరో రాష్ట్రం.. అప్పులు తీసుకుని ఏమవుతోందో మనం చూస్తూనే ఉన్నాం అని వ్యాఖ్యానించారు.
నిజానికి మోడీ.. ఈ విషయంలో కామెంట్లు చేసినప్పుడు రాష్ట్రాల పేర్లను ఎక్కడా బయట పెట్టలేదు. కానీ, అంతర్లీనంగా ఆయన రెండు తెలుగు రాష్ట్రాలను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. అదేసమయంలో డబుల్ ఇంజన్ సర్కారు కారణంగా.. అభివృద్ధి పరుగులు పెడుతుందని చెప్పారు. నిజానికి ఒక రాష్ట్రం అప్పులు చేస్తోందని చెప్పినా.. మరో రాష్ట్రం అప్పుల కోసం ప్రయత్నిస్తోందని అన్నా.. దీని వెనుక మోడీ చతురత రాజకీయ వ్యూహం రెండూ ఉన్నాయి.
ఏపీలో అనుకూల సీఎం ఉండడంతో మోడీ సహకరిస్తున్నారనే కామెంట్లు ఎప్పుడూ వినిపిస్తూనే ఉన్నా యి. అదేసమయంలో తెలంగాణలో తనను వ్యతిరేకిస్తున్న సీఎం ఉండడంతో ఆ రాష్ట్రానికి అప్పులు ఇవ్వడం లేదని అక్కడి మంత్రులే చెబుతున్నారు. ఈ పరిణామాలకు కేంద్రం మోడీనే అయితే.. ఆయన మాత్రం వ్యూహాత్మకంగా ఈ రెండు రాష్ట్రాలను అడ్డు పెట్టి కన్నడిగులను తనవైపు తిప్పుకొనే ప్రయత్నం చేయడం గమనార్హం. అందుకే దటీజ్ మోడీ అంటున్నారు నెటిజన్లు.
Gulte Telugu Telugu Political and Movie News Updates