“మనం అధికారంలో ఉన్నాం. అందరూ మనవైపు చూస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో విజయం దక్కించుకోవాలంటే.. ఐకమత్యంగా ఉండాలి. కలిసి మెలిసి పనిచేయాలి. పార్టీని గెలిపించాలి”- ఇదీ.. పార్టీ అధినేత, సీఎం జగన్ పదే పదే చెబుతున్న మాట. నేతలకే కాదు.. జిల్లాల ఇంచార్జ్ మంత్రులకు కూడా ఇదే ఆయన చెబుతున్నారు. కానీ, ఎక్కడ లోపం జరుగుతోందో తెలియడం లేదు కానీ, చాలా జిల్లాల్లో మంత్రులు విఫలమవుతున్నారు.
ప్రస్తుతం తెర మీదికి వచ్చిన ఒక్క అనంతపురం మాత్రమే కాదు.. శ్రీకాకుళం, నెల్లూరు జిల్లాల్లోనూ అక్కడ ఇంచార్జ్ మంత్రులు ఫెయిల్ అవుతున్నారు. నేతల మధ్య సఖ్యతను పెంపొందించడంలో వారు పూర్తిగా ఫెయిల్ అవుతున్నారు. ఫలితంగా ఎక్కడికక్కడ నాయకుల మధ్య ఆధిపత్య ధోరణి పెరగడంతోపాటు.. ఎమ్మెల్యేలకు స్థానికంగా ఉన్న నాయకులకు మధ్య గ్యాప్ పెరిగిపోయింది.
గత ఎన్నికల సమయంలో పనిచేసిన వారిని పట్టించుకోకపోవడం పెద్ద ఇబ్బందిగా మారింది. పార్టీ అధికారంలో ఉందని.. తమకు పనులు అవుతాయని నాయకులు ఆశలు పెట్టుకున్నారు. కానీ.. ఇప్పటికే మూడున్నరేళ్లు గడిచిపోయింది. అయితే.. ఒక్క పనికూడా జరగలేదు. ఇదీ.. వారి ఆవేదన మరో ఏడాదిలో ఎన్నికల వేడి రాజుకుంటుంది. ఇక, అప్పుడు మళ్లీ ఎన్నికలయ్యాక చూద్దామనే మాట ఎలానూ చెబుతారు. అందుకే ఎక్కడికక్కడ నాయకులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్యేలకు, మంత్రులకు కూడా టికెట్లు ఇవ్వొద్దని బాహాటంగానే చెబుతున్నారు. శ్రీకాకుళంలో మంత్రి సీదిరి అప్పలరాజుకు మామూలుగా సెగ తగలడం లేదు. ఇక, విజయవాడ పశ్చిమలో మాజీ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు కూడా ఇదే పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. మైలవరంలోనూ సొంత నేతల మధ్య వివాదాలు తారస్థాయికి చేరాయి.
విజయవాడ తూర్పులో నాయకులు సహాయ నిరాకరణ ప్రకటించారు. ఇలా రాష్ట్రంలో సుమారు 25 నియోజకవర్గాల్లో పరిస్థితి ఇలానే ఉందని ఒక అంచనా. మరి వీటిని ఎవరు దారిలో పెడతారు? ఎప్పటికి దారికి తెస్తారు? అనేది చూడాల్సి ఉంటుంది.
ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…
బీజేపీ కురువృద్ధ నాయకుడు, దేశ మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు.. ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొన్నారు. అయితే.. ఆయన…
చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…
కుప్పం.. ఏపీ సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గం. గత 40 సంవత్సరాలుగా ఏక ఛత్రాధిపత్యంగా చంద్రబాబు ఇక్కడ విజయం దక్కించుకుంటున్నారు.…
సంక్రాంతి సినిమాల హడావుడి మరో లెవెల్ కు చేరుకుంది. ఇప్పటికే రాజాసాబ్ థియేటర్లలో సందడి చేస్తుండగా రేపు మెగాస్టార్ చిరంజీవి…
ఒకప్పుడు సౌత్ ఇండియన్ టాప్ హీరోయిన్లలో ఒకరిగా ఒక వెలుగు వెలిగింది సమంత. ఇటు తెలుగులో, అటు తమిళంలో అగ్ర…