ఒకప్పుడు ఇంగ్లీష్ సినిమాలకు మన దేశంలో తెగ క్రేజ్ ఉండేది. జురాసిక్ పార్క్ నుంచి ఇది విపరీతంగా పెరిగిపోయింది. దానికి తోడు అందరికీ అర్థమయ్యేలా తెలుగు డబ్బింగ్ కూడా చేయడంతో ఆదరణ అంతకంతా పైకి వెళ్లడం తప్ప తగ్గేది కాదు. మమ్మీ సిరీస్ కు థియేటర్ల దగ్గర బ్లాక్ టికెట్లు అమ్మిన ఉదంతాలున్నాయి. లక్ష్మి గణపతి ఫిలిమ్స్ అనే డిస్ట్రిబ్యూషన్ సంస్థ కేవలం ఇలాంటి చిత్రాల హక్కులతోనే కోట్ల రూపాయల వ్యాపారం చేయడం ఒక చరిత్ర.
తర్వాత వీటి ఊపు తగ్గిపోయింది. అవెంజర్స్ లాంటివి అప్పుడప్పుడు పెద్ద సౌండ్ చేసినా క్రమం తప్పకుండ ఒక ఫ్లోలో హాలీవుడ్ సినిమాలు ఆడింది తక్కువే. కానీ చూస్తుంటే మళ్ళీ వాటికి మంచి రోజులు వచ్చినట్టే ఉన్నాయి. రెండు వారాల క్రితం రిలీజైన ది ఒడిస్సి ఇప్పటికీ ఇండియాలో స్ట్రాంగ్ గా ఉండటం అసలు షాక్. వంద కోట్ల గ్రాస్ దాటిన తర్వాత కూడా ఏ సెంటర్స్ లో చాలా స్క్రీన్లు హౌస్ ఫుల్ అవుతున్న వైనం బుక్ మై షోలో చూడొచ్చు.
తాజాగా వచ్చిన స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డే గురించి చెప్పాలంటే అరాచకం అనే మాట చిన్నదే అవుతుంది. ఇంకా ఆదివారం రాకుండానే 125 కోట్లకు పైగా గ్రాస్ లాగేయడం చూసి మతులు పోయినంత పనవుతోంది. టాక్ కొంచెం మిశ్రమంగా వచ్చినప్పటికీ ఆడియన్స్ దాన్ని లెక్క చేయడం లేదు. సాలీడు మనిషిని పెద్ద తెరపై ఎక్స్ పీరియన్స్ చేయాల్సిందేనంటూ కంకణం కట్టుకుని మరీ చూస్తున్నారు.
ట్రేడ్ వర్గాల ప్రకారం ప్రస్తుతం మన దేశంలో ఈ వీకెండ్ ది ఒడిస్సి, స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డే కలిపి 20 వేలకు పైగా షోలు పడుతున్నాయి. ఇది చాలా పెద్ద నెంబర్. ఇప్పటిదాకా ఈ రెండు సినిమాల థియేటర్ రన్ కలుపుకుంటే 80 వేలకు పైగానే షోలు జరుగుతున్నాయి. ఇక్కడే ఇలా ఉంటే యుఎస్, యుకె, ఆస్ట్రేలియా, మలేషియా లాంటి విదేశాల్లో పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.
ఉదాహరణకు ఒడిస్సి ఐమాక్స్ టికెట్లు కొన్ని చోట్ల సెప్టెంబర్ 10 దాకా అమ్ముడుపోయాయి. నలభై వేలకు పైగా ప్రేక్షకులు తమ వంతు కోసం ఆన్ లైన్ లో రిజిస్టర్ చేసుకుని ఉన్నారు. అప్పటికంతా ఓటిటిలో వచ్చినా ఆశ్చర్యం లేదు. స్పైడర్ మ్యాన్ కూడా నేనేం తీసిపోలేదనే తరహాలో రికార్డులను బద్దలు కొట్టుకుంటూ వెళ్తున్నాడు. ఆల్రెడీ అవెంజర్స్ ఎండ్ గేమ్ ని దాటేసి అవతార్ ని టార్గెట్ చేసుకున్న వైనం వసూళ్ల నెంబర్లు చూస్తే అర్థమైపోతుంది.
This post was last modified on August 1, 2026 4:22 pm
సీనియర్ నటుడు సుమంత్ ప్రధాన పాత్రలో వచ్చిన కొత్త సినిమా మహేంద్రగిరి వారాహి మీద విడుదలకు ముందు మంచి అంచనాలే…
తమిళనాడు సిఎం విజయ్ వారసుడిగా జేసన్ సంజయ్ హీరోగా తెరంగేట్రం చేసి ఉంటే ఈపాటికి అభిమానులు, నిర్మాతలు రెడ్ కార్పెట్…
హిందీలో దృశ్యం 3 బాగా ఆడుతున్న టైంలో టాలీవుడ్ ప్రేక్షకులకు వస్తున్న సందేహం ఒకటుంది. ఒకవేళ వెంకటేష్ కనక మూడో…
చైనాలో సోషల్ మీడియా ట్రెండ్‌లు, ఫొటోషూట్‌ల సంస్కృతిలో కొత్త మార్పు కనిపిస్తోంది. ప్రస్తుతం కొందరు యువతులు మేల్ మోడల్స్‌తో ప్రత్యేకంగా…
కాక్రోచ్ పార్టీ మరో ఉద్యమానికి శ్రీకారం చుట్టింది. నీట్ పేపర్ లికేజి వ్యవహారంలో ఢిల్లీలోని జంతర్ మంతర్ దగ్గర చేపట్టిన…
రాజమౌళి ఫ్యామిలీ మొత్తం ప్రమోషన్లు చేసింది. మహేష్ బాబు, జూనియర్ ఎన్టీఆర్ ప్రత్యేకంగా పొడవైన ట్వీట్ రివ్యూలతో సినిమాను మెచ్చుకున్నారు.…