Movie News

కనకరాజు సీమలో కొరియన్ దెయ్యం

బలమైన కంబ్యాక్ కోసం ఎదురు చూస్తున్న మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ఆశలన్నీ కొరియన్ కనకరాజు మీదే ఉన్నాయి. ఆగస్ట్ 7 విడుదల కాబోతున్న ఈ కామెడీ హారర్ కు మేర్లపాక గాంధీ దర్శకత్వం వహించగా, రితిక నాయక్ హీరోయిన్ గా నటించింది. జూన్ నుంచి బాక్సాఫీస్ మంచి జోష్ లో ఉన్న నేపథ్యంలో ఇది కూడా హిట్ల సరసన చేరుతుందనే నమ్మకం బయ్యర్లలో వ్యక్తమవుతోంది. ఇవాళ ట్రైలర్ లాంచ్ జరిగిపోయింది. స్టోరీ ఏంటో దాచకుండా క్లూస్ ఇచ్చేశారు.

రాయలసీమ ప్రాంతం పెనుగొండకు చెందిన కనకరాజు (వరుణ్ తేజ్) సరదాగా జీవితాన్ని గడిపే యువకుడు. కొరియా నుంచి వచ్చిన ఒక అమ్మాయి (రితిక నాయక్) ని తొలి చూపులోనే ఇష్టపడి ప్రేమిస్తాడు. ఇలా జాలీగా జరుగుతున్న ఇతని లైఫ్ లోకి ఒక కొరియన్ గ్యాంగ్ స్టర్ ఆత్మ (వరుణ్ తేజ్) లోకి ప్రవేశిస్తుంది. అక్కడి నుంచి చిత్ర విచిత్రంగా ప్రవర్తించడం మొదలుపెడతాడు. అనంతపురం నుంచి కొరియా దేశం దాకా కనకరాజు ఎందుకు వెళ్లాల్సి వచ్చింది, తర్వాత ఏమైందనేది అసలు కథ.

పవన్ కళ్యాణ్ ఓజి రేంజ్ బిల్డప్ వరుణ్ తేజ్ కి పెట్టినట్టు అనిపిస్తున్నా ప్రధానంగా నవ్వించే ఉద్దేశంతోనే మేర్లపాక గాంధీ ఈ స్క్రిప్ట్ రాసుకున్నట్టు కనిపిస్తోంది. కమెడియన్ సత్యకు మరోసారి అధిక ప్రాధాన్యం దక్కింది. మాములుగా ఇలాంటి సీరియస్ డ్రామాలలో ఎంటర్ టైన్మెంట్ కష్టం. ఎప్పుడూ బంగాళాలో దెయ్యాలను చూసి బోర్ కొట్టిందనే ఉద్దేశంతో ఈసారి ఏకంగా కొరియా నుంచి దిగుమతి చేయడం అసలు విశేషం. యునీక్ అనిపిస్తున్న అంశం ఇదే.

హాస్యం కనక ఆడియన్స్ కి కనెక్ట్ అయితే కనకరాజు ఖాతాలో హిట్టు పడ్డట్టే. వరుణ్ తేజ్ చాలా గ్యాప్ తర్వాత మంచి ఎనర్జీతో కనిపిస్తున్నాడు. తమన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ నేపధ్యానికి తగినట్టు ఉంది. పెద్దగా టెన్షన్ పడే కాంపిటీషన్ లేకుండా బరిలో దిగుతున్న కొరియన్ కనకరాజు కనక సక్సెస్ కొడితే జూలై నెల బోణీ గ్రాండ్ గా మొదలవుతుంది. వరుణ్ తేజ్ ప్రమోషన్లలో ఎడతెరిపి లేకుండా పాల్గొంటున్నాడు. ఇంత కష్టానికి తగ్గ ఫలితం దక్కాలని ఫ్యాన్స్ కోరిక.

This post was last modified on August 1, 2026 4:04 pm

Share

Recent Posts

అమరావతిలో 300 కోట్లతో కేటీఆర్ 5 స్టార్ హోటల్?

ఏపీ రాజధాని అమరావతిలో తెలంగాణా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కుమారుడు కేటీఆర్ అంతర్జాతీయ ప్రమాణాలతో హోటల్ నిర్మిస్తున్నట్లు పుకార్లు షికార్లు…

2 hours ago

ఆదర్శం వెనుకడుగు వేయడం అవసరమే

ఆదర్శ కుటుంబం ఏకె 47 విడుదల అక్టోబర్ 9 నుంచి మళ్ళీ వాయిదా పడిందనే వార్త సోషల్ మీడియాలో గుప్పుమని…

2 hours ago

స‌ల్మాన్ సినిమాకు ఎట్ట‌కేల‌కు మోక్షం?

బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ ఓ పెద్ద హిట్టు కొట్టి చాలా ఏళ్ల‌యిపోయింది. అస‌లే ఫ్లాపుల్లో ఉన్న అత‌డికి…

2 hours ago

జ్ఞానేష్ పై కేసులు తవ్వుతున్న కాంగ్రెస్

భారత ఎన్నికల సంఘంలో అత్యంత వివాదాస్పద కమిషనర్ గా పేరొందిన జ్ఞానేష్ కుమార్ చుట్టూ ఉచ్చు బిగుసుకుంటుంది. కేంద్రంలోని బీజేపీ…

3 hours ago

55 శాతం తెలంగాణ యువతకు జుట్టు సమస్యలు

యువత జీవితంలో కెరీర్, ఉద్యోగం, ఆర్థిక బాధ్యతలు కీలక దశను నిర్ణయిస్తాయి. అయితే ఇదే సమయంలో పెరుగుతున్న మానసిక ఒత్తిడి…

4 hours ago

సైబ‌రాబాద్‌కు ప్ల‌స్‌గా అమ‌రావ‌తి!

ఐటీ రంగానికి కేంద్రంగా మారిన తెలంగాణ‌లోని సైబ‌రాబాద్‌కు ప్ల‌స్‌గా అమ‌రావ‌తిని నిర్మిస్తున్నామ‌ని సీఎం చంద్ర‌బాబు తెలిపారు. వ‌చ్చే ఏడాది ఫిబ్ర‌వ‌రిలో…

4 hours ago