తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్.. ప్రస్తుతం ఎంపీగా ఉన్నారు. దీంతో ఆయనకు అసెంబ్లీలో అడుగు పెట్టి.. ముఖ్యమంత్రి కేసీఆర్‌ను నేరుగా విమర్శించే అవకాశం లేకుండా పోయిందనే ఆవేదన ఆయనలో ఉంది. ఈ నేపథ్యంలో ఆయన సంచలన నిర్ణయం తీసుకున్నారని పార్టీ వర్గాల మధ్య చర్చ సాగుతోంది. త్వరలోనే జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన తన పంథాను మార్చుకున్నారని సమాచారం. అంటే.. ఈ సారి బండి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయనున్నారన్నమాట.
వస్తే.. పార్టీకి అధికారం. లేకపోతే.. తను గెలిచైనా.. అసెంబ్లీలో కేసీఆర్‌కు కంట్లో నలుసులా మారాలని ఆయన ప్రయత్నిస్తున్నారట. ఆయనకు ఎంతో ప్రియమైన కరీంనగర్ జిల్లాలోని కీలకమైన ముథోల్ నియోజకవర్గం నుంచి బండి ఈ సారి అసెంబ్లీ బరిలో దిగుతారనే ప్రచారం జరుగుతోంది. ఈ ప్రచారానికి దన్ను.. అన్నట్టుగా ఇటీవల ఆయన తన పాదయాత్రలో ముథోల్‌ను దత్తత తీసుకుంటానని ప్రకటించారు. సంజయ్ సామాజిక వర్గానికి చెందిన మున్నూరు కాపులు ఇక్కడ బలంగా ఉండడం.. సంజయ్‌కు కలిసి వస్తున్న ప్రధాన అంశం.
మున్నూరు కాపుల ఓట్లు ఈ నియోజకవర్గంలో సుమారు 46 నుంచి 50 వేల వరకు ఉన్నాయని బీజేపీ నేతలు లెక్కలు వేస్తున్నారు. దీంతో తను కనుక బరిలో నిలిస్తే.. ఈ సామాజిక వర్గం అంతా తనకు అండగా నిలుస్తుందని బండి అప్పుడే కలలు కనేస్తున్నారని పార్టీ వర్గాలు తెగ గుసగుసలాడుతున్నాయి. మరోవైపు.. ఈ నియోజకవర్గంలో హిందువులు కూడా ఎక్కువగానే ఉన్నారు. వీరంతా కూడా తనకు అండగా నిలుస్తారనేది బండికి ఉన్న మరో లెక్క. దీంతో ఆయన ఇక్కడ నుంచి పోటీ చేయడం ఖాయమనే సంకేతాలు వస్తున్నాయి.
ఇక, ఇక్కడే మరో విషయం చెప్పుకోవాలి. తెలంగాణ ఆవిర్భావం తర్వాత జరిగిన రెండు అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా ఇక్కడ నుంచి బరిలోనిలిచిన రమాదేవి.. భారీ ఓట్లే దక్కించుకున్నారు. అంతేకాదు.. అధికార టీఆర్ఎస్ కు కూడా ముచ్చెమటలు పట్టించారు. దీంతో బీజేపీకి సానుకూల పరిణామాలు ఉన్నాయని గ్రహించిన సంజయ్.. ఇక్కడ నుంచి పోటీ చేయడం ఖాయమనే వాదన వినిపిస్తుండడం గమనార్హం. మరి సంజయ్ అభీష్టాన్ని పార్టీ అధిష్టానం ఏమేరకు అంగీకరిస్తుందో చూడాలి.
This post was last modified on December 20, 2022 9:47 am
ప్రతిష్ఠాత్మక మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్ (ఎంసీజీ) వేదికగా భారత్-ఆస్ట్రేలియా మధ్య డిసెంబర్ 26న ప్రారంభమయ్యే నాలుగో టెస్ట్ మ్యాచ్కు ముందు…
పుష్ప-2 సినిమా బెనిఫిట్ షో ప్రదర్శన సందర్భంగా హైదరాబాద్ సంధ్య థియేటర్ దగ్గర జరిగిన తొక్కిసలాటలో మహిళ చనిపోయిన ఘటనకు…
అండర్-19 ఆసియా కప్ టోర్నీలో భారత మహిళల జట్టు చరిత్ర సృష్టించింది. తొలిసారి టీ20 ఫార్మాట్లో జరిగిన ఈ టోర్నీ…
అమెరికాలో జరిగిన గేమ్ ఛేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ఫ్యాన్స్ కోసం లైవ్ స్ట్రీమింగ్ ఇవ్వనప్పటికీ…
ఇంకా సెట్స్ పైకి వెళ్లకుండానే జూనియర్ ఎన్టీఆర్ - ప్రశాంత్ నీల్ కాంబోలో రూపొందబోయే ప్యాన్ ఇండియా మూవీ మీద…
కేంద్ర మంత్రి, తెలంగాణ బీజేపీ నాయకుడు బండి సంజయ్ తాజాగా కీలక వ్యాఖ్యలు చేశారు. ఎంఐఎం తో కాంగ్రెస్ దోస్తీ…