ఇప్ప‌టం.. పవన్ తొందర పడ్డాడా?

జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్‌కు ఇప్పుడు పెద్ద సంక‌ట‌మే వ‌చ్చింద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. ఎందుకంటే.. ఆయ‌న శ‌నివారం మంగ‌ళ‌గిరి స‌మీపంలోని ఇప్ప‌టంలో ప‌ర్య‌టించి.. ఇక్క‌డి కూల్చివేత‌ల బాధితుల‌కు రూ.ల‌క్ష చొప్పున నిధులు ఇవ్వాల‌ని నిర్ణ‌యించుకున్నారు. ఇప్ప‌టికే బాధితుల‌ను కూడా సెల‌క్టు చేశారు. వీరికి వారి ఇంటి వ‌ద్దే ఈ నిధులు పంపిణీ చేయాలా? లేక ఆఫీసుకు తీసుకువ‌చ్చి ఇవ్వాలా? అనేది ఇంకా స్ప‌ష్ట‌త రాలేదు.

దీనిక‌న్నా.. ముందు అస‌లు ప‌వ‌న్ వ‌చ్చే అవ‌కాశం కూడా త‌క్కువ‌గానే ఉంద‌ని అంటున్నారు పార్టీ నాయ కులు. ఎందుకంటే.. ఇప్ప‌టంలో త‌న పార్టీ బ‌హిరంగ స‌భ‌కు భూములు ఇచ్చిన వారి ఇళ్ల‌ను ప్ర‌భుత్వం ఉద్దేశ పూర్వ‌కంగా రాత్రికి రాత్రి చెప్పాపెట్ట‌కుండా కూల్చేసిందని.. ప‌వ‌న్ చెప్పుకొచ్చారు. అదేస‌మ‌యం లో ఆయ‌న ఇక్క‌డ పాద‌యాత్ర‌గా వెళ్లి బాధితుల గోడు విన్నారు. ఈ క్ర‌మంలో ప్ర‌భుత్వంపై తీవ్ర విమ‌ర్శ లు కూడా గుప్పించారు.

అయితే, తాజాగా హైకోర్టు విచార‌ణ‌లో ఇక్క‌డి బాధితుల‌పై న్యాయ‌మూర్తులు ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ప్ర‌భు త్వం ముందుగానే నోటీసులు జారీ చేసినా..దానిని దాచిపెట్టార‌ని పేర్కొంది. అంతేకాదు, పిటిష‌న్‌లు దాఖ లు చేసిన 14 మంది కి త‌ల‌కో ల‌క్ష చొప్పున ఫైన్ కూడా వేసింది. ఇది అంత తేలిక‌గా తీసుకునే ప‌రిణామం కాదు. ఎందుకంటే.. ఇక్క‌డి స‌మ‌స్య‌పై తాను గంభీర‌మైన ఉద్య‌మం చేసిన‌ప్పుడు.. దాని తాలూకు వాస్త‌వాలు గ్ర‌హించి ఉంటే బాగుండేద‌ని జ‌న‌సేన వ‌ర్గాలే అభిప్రాయ‌ప‌డుతున్నాయి.

అయితే, ఇక్క‌డి బాధితులు చెప్పిన‌వే ప‌వ‌న్ విన్నారు త‌ప్ప‌.. వాస్త‌వాల‌ను గుర్తించ‌లేక పోయారు. ఈ నేప‌థ్యంలో హైకోర్టు తీర్పు.. ఒక్క అక్క‌డివారికే కాకుండా ప‌వ‌న్‌ను కూడా ఇర‌కాటంలోకి నెట్టేసింది. వైసీపీ నేత‌ల నుంచి కౌంట‌ర్లు కూడా ప‌డుతున్నాయి. సో.. ఇలాంటి స‌మ‌యంలో ప‌వ‌న్‌వ‌చ్చి బాధితుల‌కు రూ.ల‌క్ష ఇచ్చే ప్ర‌తిపాద‌న .. మ‌రింతగా మైన‌స్ అవుతుంద‌ని జ‌న‌సేన అభిప్రాయ‌ప‌డుతోంది. ఈ క్ర‌మంలో ప‌వ‌న్ అస‌లు వ‌స్తారా? రారా? అనే చ‌ర్చ జ‌రుగుతుండ‌డం గ‌మ‌నార్హం.