అమెరికా అధ్యక్ష ఎన్నికల విధానం కాస్త భిన్నంగా ఉంటుంది. సూటిగా కాకుండా పలు దశల్లో అధ్యక్ష ఎన్నికలు జరుగుతాయి. ఇదంతా ఒక ఎత్తు అయితే.. సాధారణంగా ఎన్నికల్లో గెలిచిన వారు.. రోజుల వ్యవధిలో అధికారాన్ని చేపడతారు.కానీ.. అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికయ్యే అభ్యర్థి కొన్నినెలల పాటు.. పదవిని చేపట్టటానికి అవకాశం ఉండదు. అధ్యక్ష పదవిని చేపట్టటానికి ముందే.. ట్రైనింగ్ కోసమన్నట్లు కొంతకాలం వెయిట్ చేయాల్సి ఉంటుంది. ఆ సందర్భంగా దశల వారీగా.. అధ్యక్షబాధ్యతలు ఎలా నిర్వర్తించాలనే అంశాలకు సంబంధించిన విషయాన్ని వారికి తెలిసేలా చేయటం ఒక అలవాటు.
ఇదిలా ఉంటే.. మరికొద్ది నెలల్లో అమెరికాఅధ్యక్ష స్థానానికి ఎన్నికలు జరగనున్నాయి. రిపబ్లికన్ పార్టీ అభ్యర్థిగా ట్రంప్ బరిలో నిలవగా.. విపక్ష డెమొక్రాటిక్ అభ్యర్థిగా జో బైడెన్ బరిలోకి వచ్చారు. తాజాగా జరిగిన ప్యూర్టోరికో ప్రైమరీలో ఆయన విజయాన్ని సాధించారు. ఈ ఎన్నికల్లో బైడెన్ ఏడుగురు అభ్యర్థుల్ని ఎదుర్కొన్నారు.
తాజాగా సొంతం చేసుకున్న గెలుపుతో పార్టీ నుంచి అధ్యక్ష ఎన్నికల్లో నామినేట్ అయ్యేందుకు అవసరమైన బలాన్నిసమకూర్చుకున్నట్లైంది. ఇప్పటికే మెజార్టీ ప్రైమరీల్లో గెలిచిన నేపథ్యంలో బెడెన్ అభ్యర్థిత్వం ఖరారైంది. తాజా విజయంతో ఆయన దూకుడు మరింత పెరగనుంది.
వాస్తవానికి ఈ ప్రైమరీ ఎన్నికలు ఈ ఏడాది మార్చిలోనే జరగాల్సి ఉంది. అప్పటికే కరోనా తీవ్రత ఎక్కువగా ఉండటంతో ఎన్నికల్ని నిర్వహించలేదు. తాజాగా నిర్వహించిన ఎన్నికల ఫలితాలు తాజాగా వెల్లడయ్యాయి. ఇందులో బైడెన్ విజయం సాధించటం సానుకూలాంశంగా చెప్పాలి. ఇప్పటికే అధ్యక్షఎన్నికల్లో ట్రంప్ తో పోలిస్తే.. బైడెన్ కు సానుకూలత వ్యక్తమవుతన్న వేళ.. తాజా విజయం ఆయనకు మరింత బలాన్ని సమకూర్చుకున్నట్లు అవుతుందని చెప్పక తప్పదు.