అవును.. టీడీపీ గెలవాలంటే.. కొన్ని విషయాలను ఉన్నపళంగా తేల్చేయాలని.. పార్టీ సీనియర్లే కోరుతున్నా రు. పార్టీ ఇప్పుడు ఎలాంటి పరిస్థితిలో ఉంది? బలమైన అధికార పార్టీ.. అంతకన్నా.. బలమైన.. సామాజిక వర్గం పోలరైజేషన్ వంటి సమస్యలు.. టీడీపీని వెంటాడుతున్నాయి. గెలుపు గుర్రం ఎక్కేస్తాం.. అని చెప్పినంత ఈజీ అయితే.. వచ్చే ఎన్నికల్లో విజయం దాఖలు అయ్యేలా లేదు. ఎందుకంటే.. ఎన్ని సర్వేలు చూసినా.. నిజాయితీ చెబుతున్న మాట.. 100 సీట్లలో.. వైసీపీ విజయం దక్కించుకుంటుందనే!
ఈ విషయం చంద్రబాబుకు తెలియంది కాదు. కానీ, ఆయన బయటకు చెప్పడం లేదు. అందుకే.. ఈ విషయాన్ని ఆయన గమనించే.. ఎన్నడూ లేని విధంగా.. పార్టీ నేతలతో నిత్యం సమావేశం నిర్వహిస్తున్నా రు. సోషల్ మీడియా వేదికగా కూడా.. పోరు తీవ్రం చేశారు. ఆయన వైపు నుంచి అంతా బాగానే ఉంది. పార్టీని నడిపించాలనేది.. ఆయన వ్యూహం. కానీ, క్షేత్రస్థాయిలో.. పార్టీకి ఉన్న సమస్యలను మాత్రం ఆయన పట్టించుకోవడం.. లేదు.
ఎక్కడికక్కడ చాలా నియోజకవర్గాల్లో.. పార్టీలో అసంతృప్తులు ఉన్నాయి. టికెట్ల గోల జోరుగా ఉంది. టికెట్ నీదా.. నాదా.. అనే సమస్యలు కూడా ఉన్నాయి. ఉదాహరణకు గన్నవరం నియోజకవర్గం చూసుకుంటే.. ఇక్కడ సుంకర పద్మశ్రీని పార్టీలోకి తీసుకుంటారని..కొన్ని రోజులు చెప్పారు. తర్వాత.. విజయవాడ తూర్పు ఎమ్మెల్యేను.. అక్కడకు పంపిస్తామన్నారు. ఇవన్నీ కావు..వేరే వారికి ఇస్తున్నారని..సోషల్ మీడియాలో ప్రచారం చేశారు. ఇవన్నీ పరిశీలిస్తే.. ఇబ్బందికరంగా ఉంది.
ఇక, విజయవాడ పశ్చిమ పరిస్థితి కూడా ఇలానే ఉంది. పొత్తులో భాగంగా జనసేనకు వదిలేస్తారా? లేక.. టీడీపీకే ఇస్తారా? అనేది తేల్చడం లేదు. మరోవైపు..ఎంపీ నాని.. తన పంజాను మరోసారి విసిరారు. సొంత పార్టీ నేతలపైనే ఆయన కాలుదువ్వారు. మాజీ మంత్రి.. అంతో ఇంతో పనిచేస్తున్న నాయకుడు..దేవినేని ఉమాపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఇవి .. మానసికంగా.. ఉమాను దెబ్బకొట్టేలా ఉన్నాయి.మరి ఇలాంటి పరిణామాలను చంద్రబాబు ముందు పరిష్కారం చేయకపోతే.. ఇబ్బంది ఎలా తప్పుతుందనేది తమ్ముళ్ల మాట.