ఉమా మహేశ్వరి మృతిపై వైసీపీ రాజకీయం

ఈ కలికాంలో రాజకీయాలు ఇంతకన్నా దిగజారవు అనకున్న ప్రతిసారి అంతకు పది రెట్లు దిగజారిపోతున్నాయనడంలో ఎటువంటి సందేహం లేదు. రాజకీయాలలో విమర్శలు, ప్రతివిమర్శలు సహజం…కానీ, వ్యక్తిగత విమర్శలు మాత్రం కచ్చితంగా ఖండించదగ్గవే. తాజాగా ‘హూ కిల్డ్ పిన్ని’ అంటూ సోషల్ మీడియాలో వైసీపీ శ్రేణులు ట్రెండింగ్ చేస్తున్న ఓ హ్యాష్ ట్యాగ్ నేటి రాజకీయాలు ఎంతకు దిగజారాయో అద్దం పడుతుంది. సీఎం జగన్ చిన్నాన్న వైఎస్ వివేకానందరెడ్డి హత్య వ్యవహారంలో పలు అనుమానాలు వచ్చిన సంగతి తెలిసిందే. ముందు గుండెపోటుతో వివేకా చనిపోయారని ప్రచారం చేసిన వైసీపీ నేతలు…ఆ తర్వాత సీబీఐ అది గొడ్డలిపోటు అని తేల్చడంతో ఖంగు తిన్నారు.

దీంతో, జగన్, వైసీపీ నేతలకు వ్యతిరేకంగా వివేకా కూతురు సునీతారెడ్డి సైతం పలు సంచలన వ్యాఖ్యలు చేశారు. వివేకా కేసుతో ఎంపీ అవినాష్ రెడ్డికి సంబంధం ఉందని ఆరోపణలు రావడం, ఈ కేసును జగన్ సరిగ్గా పట్టించుకోవడం లేదని సునీత ఆరోపణలు చేయడం సంచలనం రేపింది. ఆ తర్వాత ‘హూ కిల్డ్ బాబాయ్’ అనే హ్యాష్ ట్యాగ్ ను ప్రతిపక్ష టీడీపీ నేతలు ట్రెండ్ చేశారు. అప్పటి నుంచి టీడీపీ నేతలు ఏదైనా విషయంలో దొరికితే ఇలాగే ట్రెండ్ చేద్దామని వైసీపీ సోషల్ మీడియా విభాగం కాచుకు కూర్చుంది కాబోలు.

తాజాగా సూసైడ్ చేసుకొని చనిపోయిన కంఠమనేని ఉమా మహేశ్వరి మరణాన్ని వైసీపీ నేత దేవేంద్ర రెడ్డి ట్రెండ్ చేయడం మొదలుబెట్టారు. అయితే ఆత్మహత్య చేసుకున్న ఉమా మహేశ్వరికి…మర్డర్ అని సీబీఐ అధికారులు డిక్లేర్ చేసి, ప్రత్యక్ష సాక్షుల వాంగ్మూలాలున్న వివేకా కేసుతో ముడిపెట్టడం కరెక్ట్ కాదని కామెంట్స్ వస్తున్నాయి. నిజంగా వైసీపీ నేతల . ‘హూ కిల్డ్ పిన్ని’ అంటూ దేవేంద్ర రెడ్డి ట్రెండ్ చేసిన హ్యాష్‌ట్యాగ్ ను వైసీపీ అనుకూల వ్యక్తులు వైరల్ చేస్తున్నారు. దీంతో, వైసీపీ నేతలపై తీవ్రమైన విమర్శలు వస్తున్నాయి.

‘అవతలి వాళ్ళ చావు బతుకుల మీద అవాకులు చవాకులు పేలే పచ్చ పిచ్చ మీడియాకి.. బెడ్రూమ్‌లో వేలాడుతున్న పిన్ని శవం మీద, ఉరి తాడు ఎవరు లాగారో, పది మందికి పైగా అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు వున్న ఎన్టీయార్ కూతురికి అంత ఖర్మ ఎందుకు పట్టిందో డిబేట్లు పెట్టే సత్తా లేదా.? ఇప్పుడు పెట్టండ్రా డిబేట్లు..’ అంటూ వైసీపీ నేత దేవేందర్ రెడ్డి గుర్రంపాటి చేసిన ట్వీట్ వివాదాస్పదమమైంది. అంతేకాదు, రెండు రోజుల క్రితం దివంగత ఉమా మహేశ్వరికి, నారా లోకేష్ కు జుబ్లి హిల్స్ లోని ఆరెకరాల స్థలం విషయంలో వాగ్వాదం జరిగిందని, దీంతో, ఆమెను లోకేష్ దుర్భాషలాడారని, మనస్తాపంతో ఆమె ఉరి వేసుకుందని ప్రచారం చేస్తున్నారు దేవేంద్ర రెడ్డి. మరి ఆయన కామెంట్స్ పై టీడీపీ నేతలు ఏ విధంగా రియాక్ట్ అవుతారో చూడాలి.