కేవలం భారత్‌తోనే కాదు.. 18 దేశాలతో చైనాకు సరిహద్దు గొడవలు

China

సరిహద్దుల్లో చైనా దుందుడుకు చర్యలు ఇబ్బందికరంగా మారాయి. డ్రాగన్ దేశం తీరుపట్ల జపాన్, ఫ్రాన్స్, అమెరికా వంటి దేశాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. భారత్ పక్షాన నిలబడ్డాయి. చైనా తీరుపై భారతీయుల్లో ఆగ్రహావేశాలు వ్యక్తమయ్యాయి. చాలామంది చైనీస్ ఉత్పత్తులను కొనుగోలు చేయడం మానేశారు.

ప్రభుత్వం 59 చైనీస్ యాప్స్‌ను భద్రతాపరమైన చర్యలతో నిషేధించింది. తక్కువ కాలంలో ప్రపంచ అతిపెద్ద రెండో ఆర్థిక వ్యవస్థగా నిలిచిన చైనా కయ్యాలమారి. కేవలం భారత్‌తోనే కాదు ఆ సరిహద్దులు పంచుకున్న ఇతర దేశాలతో పాటు సరిహద్దులు లేని దేశాలతోను జగడం ఉండటం గమనార్హం.

18కి పైగా దేశాలతో చైనాకు సరిహద్దు వివాదం ఉండటం గమనార్హం. భారత్ నుండి జపాన్ నుండి పిలిప్సీన్ వరకు విస్తరణవాద భావజాలంతో అంతర్జాతీయంగా విమర్శలకు గురవుతోంది. అసలు చైనా భూభాగంపరంగా 14 దేశాలతోనే సరిహద్దులు కలిగి ఉంది. కానీ పద్దెనిమిది దేశాల కంటే ఎక్కువగా సరిహద్దు వివాదాలు కలిగి ఉంది.

దక్షిణ చైనా సముద్రంలోని కొన్ని భూభాగాలపై జపాన్-చైనా మధ్య సరిహద్దు వివాదం ఉంది. ముఖ్యంగా సెంకాకు ఐస్‌లాండ్, ర్యుక్యూ ఐస్‌లాండ్‌ను రెండు దేశాలు క్లెయిమ్ చేసుకుంటున్నాయి.

వియత్నాంకు చెందిన పలు చారిత్రక ప్రదేశాలను కూడా చైనా క్లెయిమ్ చేసుకుంటోంది. మాకిల్స్‌ఫీల్డ్ బ్యాంక్, పారాసీల్ ఐస్‌లాండ్స్‌తో పాటు దక్షిణ చైనా సముద్రంలోని భాగాలు, స్ప్రాట్లీ ఐస్‌లాండ్స్‌‌ను ఇరు దేశాలు క్లెయిమ్ చేసుకుంటున్నాయి.

38,000 కిలో మీటర్ల అక్సాయ్ చినాయ్ భారత ప్రాంతాన్ని చైనా దశాబ్దాల క్రితం ఆక్రమించింది. అంతేకాదు లడక్, అరుణాచల్ ప్రదేశ్‌లపై కూడా కన్నేసింది. చైనా విస్తరణ భావజాలం ఇటీవల లడక్ ప్రాంతంలో బారత్-చైనా ఆర్మీ మధ్య ఘర్షణకు కారణమైంది.

నేపాల్ – చైనా మధ్య 1788-1792 మధ్య యుద్ధం జరిగింది. ఈ సమయంలోని తీసుకున్న నేపాల్ భూభాగాలను తమవిగా చైనా చెబుతోంది. చైనాకు మిత్రదేశంగా భావించే ఉత్తర కొరియాతోను బేక్డూ మౌంటెన్ విషయంలో సరిహద్దు గొడవలు ఉన్నాయి.

సౌత్ చైనా సముద్రంలోని కొన్ని భాగాలపై చైనా-పిలిప్పీన్స్ మధ్య గొడవలు ఉన్నాయి. ఈ విషయమై పిలిప్పీన్స్ అంతర్జాతీయ కోర్టు మెట్లు ఎక్కింది. ఈ కేసును పిలిప్పీన్స్ గెలుచుకుంది. అయినప్పటికీ చైనా దీనికి కట్టుబడి లేకపోవడం గమనార్హం. అంతర్జాతీయ కోర్టు ఆదేశాలను కూడా తుంగలో తొక్కింది.

రష్యాకు చెందిన 1,60,000 స్క్వేర్ కిలో మీటర్ల భూభాగాన్ని చైనా క్లెయిమ్ చేసుకుంటోంది. ఇరు దేశాల మధ్య పలు ఒప్పందాలు జరిగాయి. కానీ చైనా దీనిని ఏకపక్షంగా క్లెయిమ్ చేసుకుంటోంది.

సౌత్ చైనా సముద్రంలోని కొన్ని ప్రాంతాలపై సింగపూర్ – చైనా పోటీ పడుతున్నాయి.

ఈస్ట్ చైనాలో సౌత్ కొరియా ఉంటుంది. దీనిని తమ దిగా చెబుతోంది చైనా. భూటాన్ ప్రాంతాన్ని కూడా తనదిగా చెబుతుంది.

తైవాన్ మొత్తాన్ని తమదిగా చైనా క్లెయిమ్ చేసుకునే ప్రయత్నాలు చేస్తుంది. ముఖ్యంగా మాకిల్స్‌ఫీల్డ్ బ్యాంక్, పారాసీల్ ఐస్‌లాండ్స్,తదితర ప్రాంతాలు తమవిగా చెబుతోంది.

లావోస్, బ్రూనై, తజకిస్తాన్, కంబోడియా, ఇండోనేషియా, మలేషియా, మంగోలియాలోని పలు ప్రాంతాలను తమవిగా చెబుతుంది.