`మనందరం ప్రభుత్వం` అంటూ.. ఊదరగొడుతున్న జగన్ ప్రభుత్వంలో సర్కారు నిర్ణయాలను తూచ. తప్పకుండా అమలు చేస్తున్న అత్యంత కీలకమైన ఉన్నతాధికారులు.. అఖిల భారత సర్వీసు అధికారు లు.. ఐఏఎస్, ఐపీఎస్‌లకు ఘోరాతి ఘోరమైన అవమానాలు ఎదురవుతున్నాయి. జగన్ సర్కారు తీసుకుంటున్న నిర్ణయాలు.. రాజ్యాంగ వ్యతిరేక మని తెలిసి కూడా అధినేత మెప్పుకోసం.. అదికారులు చేస్తున్నపనులు.. హైకోర్టు నుంచి మొట్టికాయలు పడేలా చేయడమే కాదు.. ఇప్పుడు ఏకంగా.. జైలు శిక్షల వరకు కూడా దారితీస్తున్నాయి.
సాధారణంగా.. జిల్లాలను శాసించే అధికారులు తమ ఉద్యోగానికి ఎంతో విలువ ఇస్తారు. ఒక్క మాట వచ్చినా.. ఎంతో కుమిలిపోతారు. ఎంతో నిబద్ధతతో పనిచేస్తారు. అలాంటి అదికారులకు.. జగనన్న పాలనలో అడుగడుగునా.. అవమానాలు ఎదురవుతున్నాయి. జగన్ ప్రభుత్వం తీసుకుంటున్న నిర్నయాలను అమలు చేస్తున్న.. అదికారులకు.. కోర్టుల నుంచి తీవ్రస్తాయిలో వ్యతిరేకత వ్యక్త మవుతోంది. తాజాగా 8 మంది సీనియర్ మోస్ట్ ఐఏఎస్‌లకు రాష్ట్ర హైకోర్టు జైలు శిక్ష విధించింది. వారు క్షమాపపణలు చెప్పడంతో కొంత వెనక్కి తగ్గినా.. శిక్షమార్చిందే తప్ప.. రద్దు మాత్రం చేయలేదు. ఇది.. వారికి తీవ్ర అవమానకరమని.. ఐఏఎస్‌లు చెబుతున్నారు.
అయితే.. జగన్ హయాంలో ఐఏఎస్‌లు మాత్రమేఏ కాదు. ఏకంగా.. మాజీ డీజీపీ గౌతం సవాంగ్ నాలుగు సార్లు.. కోర్టు మెట్లు ఎక్కారు. అదేవిధంగా ఐపీఎస్ అధికారులు కూడా చాలా సార్లు కోర్టుకు హాజరయ్యారు. ఇక,వివిధ శాఖ అధికారులు కూడా వందల సార్ల కోర్టు మెట్లు ఎక్కారు. ఇవన్నీ.. రాజ్యాంగ వ్యతిరేకంగా.. తీసుకున్న నిర్ణయాల పర్యవసానమే. అదేసమయంలో కోర్టులు తప్పని చెప్పినా.. అధినేత మెప్పుకోసం.. చేసిన పనులే కావడం గమనార్హం. అయితే.. ఇప్పటి వరకు భరించిన అధికారులు ఇక, ఇప్పుడు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
జగన్ సర్కారుపై ఐఏఎస్‌లు, ఐపీఎస్‌లు అంతర్గత చర్చల్లో నిప్పులు చెరుగుతున్నారు.ఇలా అయితే ..పెన్‌డౌన్ చేసి.. వెళ్లిపోతామనే సంకేతాలుపంపించేందుకు వారు రెడీ అవుతున్నట్టు సమాచారం. గతం లోనే ఒకరిద్దరు ఐపీఎస్‌లు.. ఐఏఎస్‌లు కోర్టు మెట్లు ఎక్కాల్సి వచ్చినప్పుడు.. ఐఏఎస్‌ల సంఘం తీవ్రంగా స్పందించింది. సీఎంకు ఏకంగా ఒక మెమొరాండం కూడా సమర్పించారు. తమపై ఒత్తిడితేవద్దని చెప్పారు. అయినప్పటికీ.. సీఎం జగన్ దీనిని చాలా సాదాసీదాగా తీసుకున్నారు. ఫలితంగానే ఇప్పుడు ఎనిమిది మందికి చరిత్రలో ఇప్పటి వరకు జరగని అవమానం ఎదురైంది.ఈ నేపథ్యంలో వీరు త్వరలోనే ఏదో ఒకటి తేల్చుకునేందుకు రెడీ అవుతున్నారని తెలుస్తోంది. మరి జగన్ ఏం చేస్తారో చూడాలి.