ఏపీ ప్రధాన ప్రతిపక్షం టీడీపీ ఆవిర్భవించి రేపటికి(మంగళవారం) 40 వసంతాలు నిండుతున్నాయి. ఈ నేపథ్యంలో అంగరంగ వైభవంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించేందుకు.. పసుపుదళం సిద్ధమైంది. రాష్ట్ర వ్యాప్తంగానే కాకుండా.. జాతీయస్థాయిలోనూ.. పార్టీ ఆవిర్భావ వేడుకలు నిర్వహించాలని నిర్ణయించారు. అదేవిధంగా అమెరికా.. బ్రిటన్, దుబాయ్ దేశాల్లోనూ.. టీడీపీ నాయకులు, కార్యకర్తలు.. పసుపు పండుగను ఘనంగా నిర్వహించనున్నారు.
అదేసమయం జిల్లాలు, నియోజకవర్గాల్లోనూ పార్టీ ఆవిర్భావ వేడుకలు నిర్వహించాలని.. చంద్రబాబు ఇప్పటికే పిలుపు నిచ్చారు. పార్టీ ఆవిర్భావ దినోత్సవాలను.. మే.. 29 వతేదీ వరకు అంటే.. మహానాడు నిర్వహించే వరకు.. చేయాలని.. తొలుత నిర్ణయించారు. మండల, గ్రామ స్థాయిలో పార్టీని మరింత పుంజుకునేలా చేయాలని.. పార్టీ ఆవిర్భా వ లక్ష్యాలను.. పార్టీ ఇప్పటి వరకు చేసిన సేవను.. అనేక మంది నాయకులను తీర్చిదిద్దిన క్రమాన్ని కూడా ప్రజలకు వివరించనున్నారు.
ఈ క్రమంలో పార్టీ కేంద్ర కార్యాలయంలో చంద్రబాబు మంగళవారం ఉదయం ఆవిర్భావ వేడుకలను ప్రారంభించిన అనంతరం.. మండల స్థాయిలో కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఈ సందర్భంగా.. పార్టీ ప్రగతిని.. జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ వివరిస్తారు. అదేవిధంగా యనమ ల రామకృష్ణుడు… బుచ్చయ్య చౌదరి పలు తీర్మానాలను ప్రవేశ పెట్టనున్నారు.
ఈ కార్యక్రమానికి నంద మూరి కుటుంబం మొత్తం హాజరు కానున్నట్టు తెలుస్తోంది. అదేవిధంగా ఎన్టీఆర్ జన్మస్థలమైన.. కృష్నాజి ల్లా నిమ్మకూరులో పార్టీఆవిర్భావ వేడుకను పండుగలా నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా లక్షమందికి అన్నదానం, వస్త్ర దానం చేయాలని.. పార్టీ నాయకులు నిర్ణయించారు. ఇక, అంతర్జాతీయస్థాయిలో వివిధ రాష్ట్రాల్లో ఎన్ ఆర్ ఐ పసుపు దళం.. పార్టీ ఆవిర్భావ వేడుకలను.. ఘనంగా నిర్వహించేందుకు.. ఏర్పాటు చేశారు.