మూడు రాజధానుల (వికేంద్రీకరణ) విషయంలో వెనకడుగు వేయబోమని సీఎం జగన్ స్పష్టం చేశారు. వికేంద్రీకరణకు అర్థం అన్ని ప్రాంతాల అభివృద్ధి కాబట్టి, అడ్డంకులు ఎదురైనా వికేంద్రీకరణ ఒక్కటే సరైన మార్గమన్నారు. అందరికీ మంచి చేయడమే ప్రభుత్వం ముందన్న మార్గమని, రాబోయే తరాలకు మంచి చేయడమే ప్రభుత్వ లక్ష్యమని సీఎం జగన్ స్పష్టం చేశారు. న్యాయ వ్యవస్థ మీద విశ్వాసం, గౌరవం ఉందని ఈ సందర్భంగా సీఎం జగన్ స్పష్టం చేశారు.
అభివృద్ధి వికేంద్రీకరణకే రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని సీఎం జగన్ తెలిపారు. రాజ్యాంగం సూచించిన మూడు వ్యవస్థల పరిధి దేనికదే ఉందని పేర్కొన్నారు. ఇటీవల రాష్ట్ర హైకోర్టు పరిధిని దాటి వ్యవహరించినట్టు అందరి అభిప్రాయం వ్యక్తం చేశారని తెలిపారు. వికేంద్రీకరణపై అసెంబ్లీలో కొత్తగా చట్టం చేయకూడదని హైకోర్టు తీర్పులో పేర్కొందని అన్నారు. వికేంద్రీకరణపై కేంద్రం కూడా తమ సమ్మతి తెలియజేస్తూ అఫిడవిట్ దాఖలు చేసిందని చెప్పారు.
వికేంద్రీకణ అనేది పూర్తిగా రాష్ట్రం పరిధిలోని అంశమని కేంద్రంగా స్పష్టంగా పేర్కొందని తెలిపారు. పెరిగిన ధరలను పరిశీలనకు తీసుకుంటే రాజధాని నిర్మాణానికి 40 ఏళ్లు పడుతుందని తెలిపారు. ఏపీ అసెంబ్లీలో వికేంద్రికరణపై చర్చ సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మాట్లాడుతూ.. వ్య వస్థల పరిధిపై రాజ్యాంగం స్పష్టత ఇచ్చిందని తెలిపారు. రాజ్యాంగంలో ప్రతీ వ్యవస్థ స్వతంత్రమైనదేన ని తెలిపారు. వ్యవస్థలు ఎవరి పరిధిలో వారు ఉంటే సమస్యలు రావని అన్నారు.
మిగిలిన వ్యవస్థలన్నీ సజావుగా సాగుతాయని తెలిపారు. శాసన వ్యవస్థ చట్టాలు చేయకూడదని కోర్టులు చెప్పలేవని తెలిపారు. చట్టాలు చేసే అధికారం శాసనవ్యవస్థకు ఉంటుందని తెలిపారు. మంచి చట్టాలు చేస్తే ప్రజలు మరలా ఎన్నుకుంటారని తెలిపారు. మంచి చట్టాలు చేయకుంటే ప్రజలు ఇంటికి పంపి స్తారని తెలిపారు. గత ప్రభుత్వం చేసిన విధానాలు నచ్చలేదు కాబట్టే ప్రజలు తమకు తీర్పు ఇచ్చారని తెలిపారు. ఇది ప్రజాస్వామ్య గొప్పతనమని తెలిపారు. శాసనసభ ఓ చట్టాన్ని చేయాలా వద్దా అని కోర్టులు నిర్ణయంచలేవన్నారు.
ఆరు నెలల్లో రాజధానిని వేల కోట్లతో పూర్తి చేయాలని చెప్పడం.. సాధ్యం కాని టైం లైన్‌ను నిర్దేశించడం సరికాదన్నారు. మొదటి తెలంగాణ ఉద్యమం అభివృద్ధి లేకపోవడం వల్ల వచ్చింది.. రెండోసారి తెలంగాణ ఉద్యమం అభివృద్ధి అంతా ఒకే దగ్గర ఉంటడం వల్ల వచ్చిందని చెప్పారు. వికేంద్రీకరణ వల్ల ఏపీ అన్ని ప్రాంతాలకు న్యాయం జరుగుతుందని కేంద్రం ఏర్పాటు చేసిన శివరామకృష్ణన్ కమిటీనే చెప్పిందని తెలిపారు. ఇదే విషయాన్ని పరిగణలోకి తీసుకొని 3 రాజధానుల బిల్లు తీసుకొచ్చామని సీఎం జగన్ అన్నారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates