అని వైసీపీ అధినేత, సీఎం జగన్పై జనసేనాని విరుచుకుపడ్డారు. ప్రభుత్వం మారినప్పుడ ల్లా రాజధానిని మార్చడం అనేది ఎక్కడా తాను వినలేదన్నారు. ఇక్కడ ఏపీలో మాత్రమే రివర్స్ పాలనలో విన్నామన్నారు. అందరికీ నమస్కారాలు చెప్పడం.. జనసేన సంస్కారమని.. పవన్ వ్యాఖ్యానించారు. వైసీపీ నేతలకు తాను అందుకే నమస్కారాలు చెప్పానని చెప్పారు. రాజధాని అమరావతి అంశంపై మాట్లాడుతూ.. ముఖ్యమంత్రులు మారినప్పుడల్లా.. రాజధానిని మార్చడం కుదరదన్నారు. ఏపీ రాజధాని అమరావతిని మార్చడం ఎవరివల్లా కాదని,.. ఎక్కడికీ పోదని చెప్పారు.
ఏపీకి మూడు రాజధానులు ఉండాలనే విషయాన్ని ఎన్నికలకు ముందు వైసీపీ ఎందుకు చెప్పలేదని.. పవన్ నిలదీశారు. రైతుల కు న్యాయం చేసే విషయంలో అప్పటి మిత్రపక్షం టీడీపీని సైతం తాము నిలదీశామని.. పవన్ వ్యాఖ్యానించారు. తాము ఎక్కడా ఎవరి కోసం రాజీపడలేదన్నారు. ఒక్క ఛాన్స్ అంటూ.. అధికారంలోకి వచ్చి రాష్ట్రాన్ని పాతికేళ్లపాటు వెనక్కి తీసుకువె ళ్లిపోయారని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మరో సారి కనుక ఛాన్స్ ఇస్తే.. స్కూలుకు వెళ్లే చిన్నారుల చేతుల్లోని చాక్లెట్లను కూడా వైసీపీ లాగేసుకుంటుందని పవన్ ఎద్దేవా చేశారు. పాలసీల్లో తప్పులు ఉంటే సరిచేసుకోవాలని పవన్ సూచించారు.
వైసీపీ నాయకులకు న్యాయవ్యవస్థ పట్ల కూడా ఎలాంటి గౌరవం లేదన్నారు. 3 వేల కోట్లు ఖర్చు చేసిన తర్వాత.. ఇప్పుడు రాజధానిని మారుస్తామంటే.. ఆ సొమ్ము ఎవడబ్బ సొమ్మని.. పవన్ నిలదీశారు. పోలీసులను కూడా వైసీపీ వదిలిపెట్టడం లేదని పవన్ అన్నారు. పోలీసులపై కూడా.. వైసీపీ నేతలు దాడులు చేస్తున్నారని అన్నారు. 2019 ఎన్నికల్లో తాము 137 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేశామన్న పవన్.. వచ్చే ఎన్నికల్లో అధికారమే లక్ష్యంగా అడుగులు వేయనున్నట్టు తెలిపారు. అప్పటి ఎన్నికల్లో తాము 7 శాతం ఓట్లు కైవసం చేసుకున్నామన్నారు.
నాయకత్వం అంటే.. ప్రతికూల పరిస్థితిలోనూ పనిచేయాలని పవన్ అన్నారు. నాయకుడికి అన్ని విషయాల్లోనూ పట్టు-విడుపు ఉండాలన్నారు. ప్రశ్నించడం అంటే మార్పునకు శ్రీకారమేనని తెలిపారు. వైసీపీ నాయకులపట్ల, పార్టీ నాయకత్వం పట్ల తనకు వ్యక్తిగత ద్వేషం లేదన్న పవన్.. రాష్ట్రం వైసీపీ పాలనలో సుభిక్షంగా ఉంటే.. తాను కూడా సంతోషించేవాడినని తెలిపారు. “ఆంధ్రప్రదేశ్ .. మా జాగీరు.. ప్రజలు మా బానిసలు“ అనుకుంటున్నారా? అంటూ.. వైసీపీ నేతలను ప్రశ్నించారు. న్యాయవ్యవస్థను కూడా వైసీపీ నాయకులు ప్రభుత్వం తప్పుదోవ పట్టించేలా వ్యవహరించారని నిప్పులు చెరిగారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates