రవితేజ ఇమేజ్ ఛట్రం నుంచి బయటికి వచ్చి, ‘మాస్ రాజా’ అనే ట్యాగ్‌ను కూడా పక్కన పెట్టి చేసిన సినిమా.. భర్త మహాశయులకు విజ్ఞప్తి. ‘నేను శైలజ’ దర్శకుడు కిషోర్ తిరుమల రూపొందించిన ఈ చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 13న రిలీజైంది. ఐతే రివ్యూలు, టాక్ యావరేజ్‌గా రాగా.. ఫలితం కూడా అందుకు తగ్గట్లే వచ్చింది.
సంక్రాంతి పండుగ అడ్వాంటేజ్‌ను ఓమాదిరిగా ఉపయోగించుకున్న ఈ మూవీ.. రవితేజ గత చిత్రాలతో పోలిస్తే కొంచెం మెరుగైన ఫలితాన్ని అందుకుంది. ఐతే మిగతా సంక్రాంతి సినిమాలన్నీ గత నెలలోనే ఓటీటీలోకి వచ్చేయగా.. రవితేజ మూవీ మాత్రం ఇంకా డిజిటల్ ప్రేక్షకులను పలకరించలేదు. థియేటర్లలో సినిమాను మిస్సయిన వాళ్లు.. ఈ చిత్రాన్ని ఎప్పుడెప్పుడు చూద్దామా అని ఎదురు చూస్తుంటే అది ఎంతకీ స్ట్రీమింగ్‌కు రాలేదు. ఓటీటీ డీల్ విషయంలో ఏదో ఒక సమస్య వల్ల స్ట్రీమింగ్ ఆలస్యం అవుతున్నట్లు తెలుస్తోంది.
ఐతే ఇప్పుడు ఆ సమస్య తీరిపోయిందని.. అతి త్వరలోనే ‘భర్త మహాశయులకు’ టీవీ, మొబైల్ ప్రేక్షకులను పకలరించబోతోందని సమాచారం. మార్చి 13 నుంచి జీ5లో ఈ చిత్రం స్ట్రీమ్ కానుంది. ఈ చిత్రాన్ని సుధాకర్ చెరుకూరి నిర్మించగా.. జీ స్టూడియోస్ కూడా నిర్మాణంలో భాగం పంచుకుంది.
‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ కంటెంట్ పరంగా యావరేజే కానీ.. ఇందులో కొన్ని హైలైట్లు ఉన్నాయి. రవితేజ తన ఇమేజ్‌కు భిన్నంగా ఒక సాధారణ భర్త పాత్రలో కనిపించడం.. హీరోయిన్లు ఆషికా రంగనాథ్, డింపుల్ హయతిల అందచందాలు.. కొన్ని కామెడీ సీన్లు.. పాటలు ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి.
ఇదిలా ఉండగా.. సంక్రాంతి తర్వాత తమిళ, తెలుగు భాషల్లో వచ్చిన చిత్రాల్లో ది బెస్ట్ అనదగ్గ ‘విత్ లవ్’ సైతం డిజిటల్ స్ట్రీమింగ్‌కు రెడీ అయింది. ఆ చిత్రం మార్చి 6న నెట్‌ఫ్లిక్స్ ద్వారా డిజిటల్‌గా రిలీజ్ కాబోతోంది. ఒక విభన్న కథాంశంతో తెరకెక్కిన ఈ ప్రేమకథా చిత్రం.. ఓటీటీలోకి వచ్చాక మరింత ఆదరణ దక్కించుకోవడం ఖాయం.
Gulte Telugu Telugu Political and Movie News Updates