అమ‌రావ‌తి: జై కొడుతున్న కేసీఆర్!

సీఆర్డీఏ యాక్ట్ ను అమ‌లు చేయాల‌ని కోర్టు చెప్పినా కూడా వినేందుకు సిద్ధంగా లేమ‌ని నిన్న‌టి వేళ మంత్రి బొత్స స‌త్య‌నారాయ‌ణ చెప్ప‌డంతో ముందున్న కాలంలో అమ‌రావ‌తి రైతులు కేసీఆర్ మద్ద‌తు కూడా కోరేందుకు అవకాశాలు ఉన్నాయి. ఎలానూ విభ‌జ‌న చ‌ట్టం అమలులో జ‌రిగిన లేదా జ‌రుగుతున్న అన్యాయంపై జ‌గ‌న్ మాట్లాడడం లేదు కానీ రాజ‌ధాని ప్రాంతంకు చెందిన రైతుల‌ను మాత్రం బాగానే నిలువ‌రిస్తున్నారు. ఇందుకు కులం కార్డు  కూడా ఓ ఆయుధంగా మ‌లుస్తున్నారు.

అమ‌రావ‌తికి కేసీఆర్ జై కొడుతున్నారు.కొట్ట‌బోతున్నారు కూడా! ఇక‌పై ఆ ప్రక్రియ ఇంకా సులువు కానుంది కూడా! ఎందుకంటే రానున్న కాలంలో ఆంధ్రా రాజ‌కీయాల్లో కూడా ఆయ‌న రాణించాల‌న‌కుంటున్నారు. అదేవిధంగా త‌న‌కంటూ ఓ సొంత ఇమేజ్ ను క్రియేట్ చేసుకునే ప‌నిలో కూడా ఉన్నారు.ఉద్య‌మ పార్టీగా తెలంగాణ రాష్ట్ర స‌మితి ఉన్న‌ప్ప‌టి నుంచి ఆంధ్రాలో కూడా కేసీఆర్ కు మంచి ఫాలోయింగ్ ఉంది.దానిని ఎవ్వ‌రూ కాద‌న‌లేరు. అందుకే రానున్న కాలంలో సొంతంగా ఓ జాతీయ పార్టీ ప్రారంభించినా, పీపుల్స్ ఫ్రంట్ పేరిట కూట‌మి రాజ‌కీయాలు న‌డిపినా ఆయ‌న‌కు ఆంధ్రా పాలిటిక్స్ అన్న‌వి ఎంతో ముఖ్యం.ఇక్క‌డ ఓటు బ్యాంకు అన్న‌ది ఆయ‌న‌కు ఎంతో అవ‌స‌రం కూడా!

కేసీఆర్ త‌న‌దైన శైలిలో అమ‌రావ‌తి ఉద్య‌మానికి ముఖ్యంగా రాజ‌ధానిగా ఈ ప్రాంతాన్ని ఉంచేందుకు కూడా కేసీఆర్ మ‌ద్దతు ఎంతో అవ‌స‌రం. అయినా ఆ రోజు అమ‌రావ‌తి శంకుస్థాప‌న‌కు మోడీతో పాటు కేసీఆర్ కూడా వ‌చ్చి వెళ్లారు.నాటి శిలాఫ‌ల‌కంపై కూడా మోడీ,కేసీఆర్ పేర్లు ఉంటాయి. క‌నుక ఆ రోజు మాదిరిగానే ఈ రోజు కూడా అమ‌రావ‌తికి మ‌ద్ద‌తు ఇవ్వాల‌ని కేసీఆర్ భావిస్తున్నారు. ఈ క్ర‌మంలో కేసీఆర్ త‌రువాత కాలంలో కూడా అమ‌రావ‌తి రైతుల ఉద్య‌మానికి కానీ లేదా సంబంధిత ప్ర‌తిపాద‌న‌లకు కానీ మ‌ద్దతు ఇవ్వ‌డం ఖాయం. త‌ద్వారా రాజ‌కీయ ల‌బ్ధి పొందేందుకు  ఉన్న మార్గాలు అన్నీ కేసీఆర్ కే అనుకూలంగా మార‌నున్నాయి.

ఇదే ద‌శ‌లో జ‌గ‌న్ కు అమ‌రావ‌తి అభివృద్ధిపై అస్స‌లు ఇష్టం లేదు. అంతేకాదు ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలంటే ల‌క్ష కోట్ల రూపాయ‌లు కావాల‌ని, అంత‌మొత్తం తాము వెచ్చించ‌లేమ‌ని అసెంబ్లీ వేదిక‌గా ఆర్థిక మంత్రి బుగ్గ‌న రాజేంద్ర చెప్పారు.దీంతో అమ‌రావతి కి సంబంధించి సీఆర్డీఏ చట్టం అమ‌లుకు సంబంధించి హైకోర్టు స్ప‌ష్టంగా తీర్పు వెలువ‌రించిన‌ప్ప‌ట‌కీ వాటిని పాటించేందుకు జ‌గ‌న్ క్యాబినెట్ సిద్ధంగా లేదు. ఎలా అయినా సుప్రీం వేదిక‌గా అమ‌రావ‌తి రైతుల పోరాటానికి వ్య‌తిరేకంగా 3 రాజ‌ధానుల‌కు మ‌ద్దతుగా న్యాయ పోరాటం చేయాల‌ని జ‌గ‌న్ అనుకుంటున్నారు. ఇదే క‌నుక జ‌రిగితే మ‌రింత లోతుగా అధ్య‌య‌నం చేసి అయినా ఈ ప్రాంత రైతుల ల‌బ్ధికి అటు కేసీఆర్ ఇటు చంద్ర‌బాబు ఏక‌మై  ఉద్య‌మాన్ని ముందుకు తీసుకువెళ్లే అవ‌కాశాలు ఉంటే అప్పుడు జ‌గ‌న్ కు రాజ‌కీయంగా చుక్కెదురు కావ‌డం ఖాయం.