ఆంధ్రాలో కేసీఆర్ కటౌట్లు దేనికి సంకేతం?

ఏపీలో త‌న సినిమాను బ‌త‌క‌నివ్వ‌డం లేదు అని,వ‌కీల్ సాబ్ మొద‌లుకుని భీమ్లా నాయ‌క్ వ‌ర‌కూ జ‌గ‌న్ స‌ర్కారు త‌న‌ను వేధిస్తూనేఉంద‌ని ప‌వ‌న్ వాపోతున్నారు. ఇదే స‌మ‌యంలో తెలంగాణ వాకిట త‌న సినిమాకు ఐదు షోలు ఇవ్వ‌డంపై ఆయ‌న వ‌ర్గం ఆనందం వ్య‌క్తం చేస్తోంది. ఓ వైపు ఆంధ్రాకు సినిమా ఇండ‌స్ట్రీ త‌ర‌లి రావాల‌ని జ‌గ‌న్ చెబుతూనే మ‌రోవైపు మాత్రం క‌నీసం టికెట్ల విష‌య‌మై కొత్త జీఓ ఇవ్వ‌క‌పోగా, స‌వ‌రించిన ధ‌ర‌లపై స్ప‌ష్ట‌త అన్న‌ది లేక‌పోగా తాజాగా భీమ్లా నాయ‌క్ విడుద‌ల నేప‌థ్యంలో థియేట‌ర్ల‌పై దాడులు దేనికి సంకేతం అని నిల‌దీస్తోంది జ‌న‌సేన‌.

ఇంత జ‌రిగినా కూడా తాము వైసీపీపై రాజ‌కీయంగా ఉన్న పోరును మాత్రం ఆపేదే లేద‌ని స్ప‌ష్టం చేస్తోంది.త‌మ‌ను ఎంత‌గా అడ్డుకున్నా స‌రే తాము ప‌డినా లేస్తామ‌ని ప‌వ‌న్ అంటున్నారు. ఈ నేప‌థ్యంలో ప‌వ‌న్ అభిమానులు కేసీఆర్ కు అనుగుణంగా క‌టౌట్లు పెడుతున్నారు.సోష‌ల్ మీడియాలో జ‌య‌హో కేసీఆర్ అంటున్నారు.ఇదే స‌మ‌యంలో సంద‌ర్భంలో మంత్రుల‌ను ఎక్క‌డికక్క‌డ అడ్డుకోవాల‌ని,తమ నిర‌స‌న తెలియ‌జేయాల‌ని జ‌న‌సేన భావిస్తోంది.నిన్న‌టి వేళ విజ‌య‌వాడ‌లో పేర్ని నానిని,కొడాలి నానిని అడ్డుకున్న విధంగానే రేప‌టి వేళ జ‌గ‌న్ ను కూడా అడ్డుకుని త‌మ సత్తా చాటాల‌ని ప‌వ‌న్ అభిమాన గ‌ణం చూస్తోంది అని స‌మాచారం.అలా అయితేనే జ‌న‌సేన మ‌నుగ‌డ సాగించ‌డం సాధ్యం అవుతుంద‌ని భావిస్తోంది అని తెలుస్తోంది.

ఆంధ్రాలో ఎక్క‌డ చూసిన భీమ్లా నాయ‌క్ సినిమాపైనే చ‌ర్చ న‌డుస్తోంది.పోలీసు అధికారులు ఈ రోజు కూడా థియేట‌ర్ల ద‌గ్గ‌ర సంద‌డి చేశారు.రెవెన్యూ అధికారులు కూడా నిన్న‌టిలానే చాలా చోట్ల అతిచేస్తూ  ప్ర‌వ‌ర్తిస్తున్నారు.ఇవ‌న్నీ ఎలా ఉన్నాఆంధ్రాలో ముఖ్యంగా విజయ‌వాడ‌లో కేసీఆర్ క‌టౌట్లు దేనికి సంకేతం అన్న వాద‌న ఒక‌టి వినిపిస్తోంది. దీంతో ప‌వ‌న్ పోరు తీవ్ర‌తరం చేసి, కేసీఆర్ సాయంతో వ‌చ్చే ఎన్నిక‌ల్లో మ‌రింత ముందుకు వెళ్ల‌నున్నార‌న్న వాద‌న కూడా వినిపిస్తోంది.వీటిపై ప్ర‌స్తుతానికి ప‌వ‌న్ ఏ విధమ‌యిన క్లారిటీ ఇవ్వ‌కున్నా త‌మ‌ను అదే ప‌నిగా వేధించ‌డం మానుకోవాల‌ని వైసీపీ స‌ర్కారును ప‌వ‌న్ హిత‌వు చెబుతున్నారు.

వాస్త‌వానికి గ‌త ఎన్నిక‌ల్లో వైసీపీకి టీఆర్ఎస్ ఎంత‌గానో సాయం చేసింది అన్న‌ది ఓ వాస్త‌వం.ముఖ్యంగా ఎన్నిక‌ల స‌మ‌యంలో ఇరు పార్టీల మ‌ధ్య లోపాయికారి ఒప్పందాలు జ‌రిగాయి అని కూడా అంటుంటారు.ఇందులో భాగంగానే వైసీపీ పూర్తిగా తెలంగాణ‌ను వ‌దిలి ఆంధ్రాలోనే పోటీచేసింద‌ని,అదేవిధంగా జ‌గ‌న్ కూడా త‌న ప‌రిధి మేర‌కు కేసీఆర్ కు త‌న వ‌ర్గం ఓటు ప‌డేలా చేశార‌న్న వాద‌న కూడా ఉంది. ఇదే స‌మ‌యంలో ప‌వ‌న్ మాత్రం క‌మ్యూనిస్టులతో వెళ్లి త‌ప్పు చేశారు.టీడీపీతో గ‌తంలో మాదిరి పొత్తు పెట్టుకున్నా కొంత‌లో కొంత‌న‌యంగానే ఉండేద‌న్న వాద‌న వ‌చ్చింది.జ‌న‌సేన అనుకూల ఓటింగ్ కార‌ణంగా వైసీపీ క‌న్నా టీడీపీనే ఎక్కువ న‌ష్ట‌పోయింది.ఈ త‌రుణంలో వ‌చ్చే ఎన్నిక‌ల్లో పొత్తుల‌పై ఏమీ తేల‌క‌పోయినా జ‌న‌సేన మాత్రం అటు బీజేపీతోనూ
ఇటు కేసీఆర్ తోనూ స‌ఖ్యంగానే ఉంటోంది. ఇదే స‌మ‌యంలో ప‌వ‌న్ త‌న‌దైన శైలిలో వైసీపీపై పోరు తీవ్రం చేసేందుకు ఆలోచిస్తున్నారు.