త్వరలోనే పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం పార్లమెంటు స్థానానికి ఉప ఎన్నిక వచ్చే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. ఇక్కడ నుంచి గత 2019 ఎన్నికల్లో విజయం దక్కించుకున్న వైసీపీ ఎంపీ రఘురామకృష్ణరాజు త్వరలోనే తన పదవికి రాజీనామా చేస్తానని చెప్పారు. ఫిబ్రవరి 5న తన పదవిని వదులు కుంటానని వెల్లడించారు. అయితే..ఆయన ఆ సమయానికి రాజీనామా చేసే అవకాశం కనిపించడం లేదు. ఎందుకంటే.. అప్పటికి బడ్జెట్ సమావేశాలు మంచి పీక్ స్టేజ్‌లో ఉంటాయి. సో.. ఆ సమావేశాల అనంతరం.. ఆయన రాజీనామా చేయొచ్చు.
దీంతో అప్పటి నుంచి ఆరుమాసాల్లోపు ఎప్పుడైనా ఎన్నకలు వచ్చే ఛాన్స్ కనిపిస్తోంది. అయితే.. ఈ ఎన్నికల్లో అమరావతి అజెండాగా..తాను బరిలోకి దిగుతానని.. రఘురామ ఇప్పటికే స్పష్టం చేశారు. సో.. ఆయన ఒకవైపు ఉంటే.. మరోవైపు.. వైసీపీ తరఫున పోటీ చేసే నేత విషయం ఆసక్తిగా మారింది. ఈ క్రమంలో తాజాగా .. ఒక విషయం వెలుగు చూసింది. వైసీపీ తరఫున స్థానిక నేతలుఎవరికీ ఛాన్స్ ఇవ్వబోరని అంటున్నారు. అంతేకాదు.. నరసాపురం బరిలో మాజీ ఐఏఎస్ అధికారి.. గతంలో వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో పనిచేసిన.. ఎంజీవీకే(ముద్రగడ గోపాల వెంకట కృష్ణ) భానును రంగంలోకి దింపుతారని అంటున్నారు.
కాపు సామాజిక వర్గానికి చెందిన భాను.. 2019 సార్వత్రిక ఎన్నికలకు రెండుమాసాల ముందు రిటైర్ అయ్యారు. ఆయన పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లి గూడెం మండల పరిధిలోని నవాబుపాలెం ప్రాంతానికి చెందిన వ్యక్తి. అయితే.. ఆయన స్థానికంగా కొన్నేళ్ల నుంచి ఉండడం లేదు. పైగా.. ఈ శాన్య రాష్ట్రంలో ఎక్కువ కాలం పనిచేసిన నేపథ్యంలో అక్కడే ఉన్నారు. పైగా.. 2019 ఎన్నికల్లో ఆయన కాంగ్రెస్ తరఫున పోటీ చేసి అస్సాం నుంచే పార్లమెంటుకు పోటీ చేశారు. ఈ సమయంలో ఆయన తనకు అస్సాం.. పుట్టిల్లు.. అంటూ కామెంట్ చేశారు.
సరే! ఇప్పుడు ఆయనను వైసీపీ ఎంచుకోవడం వెనుక రీజనేంటి? అనేది ఆసక్తిగా మారింది. స్థానికంగా పార్టీకి అనేక మంది నాయకులు ఉన్నారు. పైగా బీజేపీలో ఒకప్పుడు చక్రం తిప్పిన.. గోకరాజు గంగరాజు కుమారుడు కూడా వైసీపీలోనే ఉన్నారు. టికెట్ ఇస్తామంటే.. పోటీకి కూడా రెడీగా ఉన్నారు. అయినప్పటికీ.. మాజీ ఐఏఎస్‌కు వైసీపీ మొగ్గు చూపుతోంది. దీనికి రీజనేంటి? అంటే.. ఒకటి.. స్థానిక నేతలపై కొన్ని ఆరోపణలు ఉన్నాయి. దీంతో ప్రజల్లోవారిపై వ్యతిరేకత ఉండే అవకాశం ఉంది.
అలా కాకుండా.. భానును తీసుకురావడం ద్వారా.. కాపు సామాజిక వర్గం ఓట్లు తమకు గుండుగుత్తుగా పడతాయనే ఆలోచన అయి ఉంటుందని.. ఎస్సీ,ఎస్టీ ఓట్లు కూడా తమకు వస్తాయని ఆశిస్తున్నట్టు సమాచారం. మరి ఏం జరుగుతుందో చూడాలి. వీటన్నింటికన్నా ముఖ్యంగా స్థానిక నేతలకు ఎవరికి టికెట్ ఇచ్చినా.. పార్టీలో అసంతృప్తులు.. ఒకరిపై ఒకరు విమర్శలుచేసుకునే అవకాశం ఉంటుందని.. వైసీపీ నేతలు భావిస్తున్నట్టు సమాచారం. మరి భాను ఏమేరకు సక్సెస్ అవుతారో చూడాలి.
Gulte Telugu Telugu Political and Movie News Updates