రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆసక్తికర చర్చకు కేరాఫ్ అడ్రస్ గా నిలుస్తుంటారు వైఎస్ షర్మిల. అందరి అంచనాలకు భిన్నంగా తెలంగాణలో రాజకీయ పార్టీని ఏర్పాటు చేసిన ఆమె.. ఇటీవల కాలంలో తన సోదరుడు కమ్ ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి తో విభేదాలు పొడ చూపాయని.. క్రిస్మస్ ముందు రోజు రాత్రి ఇడుపులపాయలోని గెస్టు హౌస్ లో తన సోదరుడు జగన్ తో షర్మిల గొడవ పడినట్లుగా వార్తలు రావడం తెలిసిందే.
ఆంధ్రజ్యోతి ఎండీ ఆర్కే రాసే.. వీకెండ్ కామెంట్ లో.. ఆయనీ సంచలన అంశాల్ని ప్రస్తావించారు. సాధారణంగా ఇలాంటి రాజకీయ ఆరోపణలు.. సంచలనాలు చోటు చేసుకున్నంతనే.. అందుకు స్పందనగా ఎవరో ఒకరు స్పందించటం కనిపిస్తుంది. అందుకు భిన్నంగా.. గడిచిన వారం వ్యవధిలో సీఎం జగన్.. ఆయన సోదరి షర్మిల మధ్య తీవ్రస్థాయిలో గొడవ జరిగిందన్న విషయం అబద్ధమని.. అసత్యమని.. అలా జరగలేదంటూ చెప్పినోళ్లే లేరు. ఆ మాటకు వస్తే.. అసలు ఆ విషయం ఒకటి ఉందన్న మాటను ప్రస్తావించటానికి సైతం ఇష్టపడని పరిస్థితి.
ఇదిలా ఉంటే.. తాజాగా రాసిన కాలమ్ లో మరికొన్ని ఆసక్తికరమైన అంశాల్ని పేర్కొన్నారు. కడప ఎంపీ స్థానం నుంచి ఎవరు పోటీ చేయాలనే దానిపై దివంగత వైఎస్ వివేకానంద.. తన సోదరుడి కుమార్తె షర్మిలతో పదే పదే ప్రస్తావించేవారా? అంటే అవునన్న మాటను చెబుతున్నారు.
కడప నుంచి అయితే నువ్వు కానీ.. లేదంటే నేను కానీ పోటీ చేయాలే తప్పించి.. ఇంకెవరో ఎందుకు పోటీ చేయాలి? అన్న మాటను షర్మిలతో వైఎస్ వివేకా తరచూ చెప్పే వారంంటూ ఆంధ్రజ్యోతి ఆర్కే తాజాగా తన కాలమ్ లో పేర్కొన్నారు. ఇదే అంశాన్ని షర్మిల.. సీబీఐ అధికారులతో చెబితే.. వైఎస్ వివేకా హత్య కేసుకు సంబంధించి కొత్త పరిణామాలు చోటు చేసుకుంటాయన్న మాట వినిపిస్తోంది. మరేం జరుగుతుందో కాలమే సరైన చెప్పాలి.
Gulte Telugu Telugu Political and Movie News Updates