మోడీ సంచ‌ల‌న నిర్ణ‌యం.. మూడు సాగు చ‌ట్టాలు ర‌ద్దు!

దేశంలో రైతే రాజు.. అన్న నినాదం మ‌రోసారి నిజ‌మైంది. గ‌డిచిన 9 మాసాలుగా.. దేశ‌వ్యాప్తంగా ఉద్య‌మిస్తు న్న రైతుల‌కు విజ‌యం ద‌క్కింది. కేంద్ర ప్ర‌భుత్వం తీసుకువ‌చ్చిన మూడు సాగు చ‌ట్టాల‌కు వ్య‌తిరేకంగా.. రైతులు ఉద్య‌మిస్తున్న విష‌యం తెలిసిందే. అయితే.. తాము ఎట్టి ప‌రిస్థితిలోనూ.. ఈ సాగు చ‌ట్టాల‌ను వెన‌క్కి తీసుకునేది లేద‌ని.. కేంద్రంలోని న‌రేంద్ర మోడీ స‌ర్కారునిన్న‌టి వ‌ర‌కు చెప్పింది. అంతేకాదు.. ఈ విష‌యంలో రాజ‌కీయంగా కూడా రాజీ ప‌డ‌లేదు. చాలా మంది నాయ‌కులు పార్టీకి రిజైన్ చేశారు. పంజాబ్‌లోని.. మిత్ర ప‌క్షం కూడా బీజేపీకి వ్య‌తిరేకంగా మారిపోయింది. కౌర్ త‌న మంత్రి ప‌ద‌వికి కూడా రిజైన్ చేశారు.

ఇక‌, దేశ వ్యాప్తంగా.. రైతాంగం.. ఉద్య‌మించారు. ముఖ్యంగా పంజాబ్ సరిహ‌ద్దుల్లోని సిక్రీలో ఇప్ప‌టికీ.. రైతు లు ఉద్య‌మిస్తున్నారు. తికాయ‌త్ వంటి కీల‌క నేత‌లు గ‌ళం వినిపించారు. రాష్ట్రాలు కూడా బంద్ పాటించాయి. దేశ వ్యాప్తంగా నిర‌స‌న‌లు వ్య‌క్త‌మ‌వ‌య్యాయి. పార్ల‌మెంటు కూడా ద‌ద్ద‌రిల్లింది.

అయిన‌ప్ప‌టికీ.. ప్ర‌ధాని మోడీ కానీ.. కేంద్ర మంత్రులు కానీ.. వ్య‌వ‌సాయ చ‌ట్టాల‌పై వెన‌క్కి త‌గ్గేది లేద‌ని స్ప‌ష్టం చేశారు. దీనిపై రాజ్య‌స‌భ అయితే.. వ‌రుసగా వాయిదా ప‌డ‌డంతోపాటు.. స‌భ‌లో జ‌రుగుతున్న గంద‌ర‌గోళంపై ఉప‌రాష్ట్ర‌ప‌తి స‌భ చైర్మ‌న్ వెంక‌య్య ఏకంగా క‌న్నీరు పెట్టుకున్నారు.

ఇక‌, రైతుల‌పై పోలీసులు ఉక్కుపాదం మోపారు. అనేక రూపాల్లో నిర్బంధాలు విధించారు. అయిన‌ప్ప‌టికీ.. రైతులు వెన‌క్కి త‌గ్గ‌లేదు. ఉద్య‌మిస్తూనే ఉన్నారు. తాజాగా తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ కూడా రైతుల‌కు అండ‌గా ఉంటామ‌ని.. ప్ర‌క‌టించారు. ఈ ప‌రిణామాల నేప‌థ్యంలో కేంద్రంలోని మోడీ స‌ర్కారు సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకుంది. మూడు వ్య‌వ‌సాయ చ‌ట్టాల‌ను ర‌ద్దు చేస్తున్న‌ట్టు ప్ర‌క‌టించింది.

గురునాన‌క్ జ‌యంతిని పుర‌స్క‌రించుకుని జాతిని ఉద్దేశించి ప్ర‌సంగించిన ప్ర‌ధాని .. రైతు చ‌ట్టాల‌ను పూర్తిగా ర‌ద్దు చేస్తున్న‌ట్టు ప్ర‌క‌టించారు. దీంతో దేశంలో రైతే రాజు.. అని మ‌రో సారి నిరూపిత‌మైన‌ట్టు.. నెటిజ‌న్లు అభిప్రాయ‌ప‌డుతున్నారు.