స‌హ‌నం కోల్పోతే.. క‌ష్టం కాదా.. బాబూ! నెటిజ‌న్ల టాక్‌

వ‌రుస ఓట‌ములు.. క‌లిసిరాని నాయ‌కులు.. అమ‌లు కాని అజెండాలు.. వెర‌సి.. టీడీపీ ప‌రిస్థితి తీవ్ర ఇబ్బం దిగా మారింది. మ‌రోవైపు అధికార వైసీపీ.. అటు ఎన్నిక‌ల ప‌రంగా.. ఇటు నైతికంగా కూడా టీడీపీని టార్గెట్ చేస్తోంది. ఈ ప‌రిస్థితి నిజంగా.. చంద్ర‌బాబు రాజ‌కీయ జీవితంలో ఒక అగ్ని ప‌రీక్ష‌గా మారింద‌నే అంటున్నారు నెటిజ‌న్లు.

చంద్ర‌బాబు పైకి.. ఇలాంటివి ఎన్నో చూశాం! అని చెబుతున్నా.. నిజానికి ఇప్పుడు ఎదు ర్కొంటున్న రాజ‌కీయాల‌ను ఆయ‌న ఎప్పుడూ ఎదుర్కొన‌లేదు. ఎందుకంటే.. వైఎస్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి హ‌యాంలో కూడా చంద్ర‌బాబు నియోజ‌క‌వ‌ర్గంపై ఇంత‌లా క‌సి పెంచుకోలేదు.

పార్టీల ప‌రంగానే నాయ‌కులు విభేదించుకున్నారు. రాజ‌కీయంగా అధికారం కోసం పోరాడుకున్నారే త‌ప్ప‌.. వ్య‌క్తిగ‌త రాజ‌కీయాల‌ను ట‌చ్ చేయ‌డం.. నియోజ‌క‌వ‌ర్గాల్లో ఓడించ‌డం ద్వారా.. నైతికంగా దెబ్బ‌తీయాల‌ని ల‌క్ష్యాలు పెట్టుకోవ‌డం వంటివి క‌నిపించ‌లేద‌నేది వాస్త‌వం. కానీ.. ఇప్పుడు ఇలాంటి రాజ‌కీయాలే ఏపీలో క‌నిపిస్తున్నాయి.

అయితే.. ఇప్పుడు .. చంద్ర‌బాబు సీనియ‌ర్ మోస్ట్ నాయ‌కుడిగా చేయాల్సింది ఏంటి? నైతికంగా.. ఆయ‌న ద్రుఢంగా ఉండాల్సిన అవ‌స‌రం ఉంది. ఆయ‌న‌లోనే నైరాశ్యం ఏర్ప‌డినా.. భ‌యం తాలూకు ల‌క్ష‌ణాలు పొడచూపినా.. క‌ష్ట‌మే అంటున్నారు ప‌రిశీల‌కులు. అయితే.. చంద్ర‌బాబు ఎక్క‌డా ఆ త‌ర‌హా ధైర్యం క‌నిపించ‌డం లేదు. ఇది నిజం.

త‌న సొంత ఇలాకాలోనే వైసీపీ పాగా వేయ‌డాన్ని క‌నీసం తాము పోటీ ఇవ్వ‌లేక పోవ‌డాన్ని చంద్ర‌బాబు సీరియ‌స్‌గానే తీసుకున్నారు. అయితే.. ఇది దిగులుగా మారి.. నైరాశ్యంలోకి దిగిపోయే ప్ర‌మాదం ఏర్ప‌డింది. తాజాగా ఆయ‌న వ్య‌వ‌హ‌రించిన విధానం తీవ్ర ఇబ్బందిగా మారింది. తాజాగా అసెంబ్లీ స‌మావేశానికి వ‌చ్చిన చంద్ర‌బాబు.. నేరుగా త‌నే.. రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఇది .. రాజ‌కీయ జీవితంలో చంద్ర‌బాబు ఎప్పుడూ చేయ‌లేదు. ఎప్పుడైనా.. మీడియా ముందుకు వ‌చ్చి ప్ర‌భుత్వాన్ని విమ‌ర్శించారే త‌ప్ప‌.. ఒక చోటా నాయ‌కుడిగానో.. లేక కార్య‌క‌ర్త‌గానో.. ఆయ‌న బిహేవ్ చేయ‌లేదు.

కానీ, తాజాగా.. అసెంబ్లీ సమావేశాలకు హాజరు కావడానికి ముందుగా చంద్రబాబు నాయుడు వెంకటపాలెం లో దివంగత ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం అక్కడ నుంచి వెలగపూడి అసెంబ్లీ ప్రాంగణం వరకు చంద్రబాబుతో పాటు ఆ పార్టీ నేతలు నిరసన ర్యాలీ చేపట్టారు. ప్రజా కంటక ప్రభుత్వం నశించాలి అంటూ రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా చంద్ర‌బాబే స్వ‌యంగా నినాదాలు చేశారు.

ఈ ప‌రిణామంతో ఒక్క‌సారిగా అంద‌రిలోనూ ఆశ్చ‌ర్యం వ్య‌క్త‌మైంది. దీనిపై నెటిజ‌న్లు కూడా గంభీరంగా కామెంట్లు చేశారు. స‌హ‌నం ముఖ్యం బాబూ అంటూ.. కొన్ని సూచ‌న‌లు చేశారు. పార్టీ కేడ‌ర్ నిల‌దొక్కుకోవాలంటే.. పార్టీ అధినేత‌కు ఇలాంటి స‌వాళ్లు త‌ప్ప‌వ‌ని అన్నారు. మ‌రి చంద్ర‌బాబు ధైర్యంగా ఉండాల్సిన స‌మ‌యంలో ఏం చేస్తారో చూడాలి.