‘వైసీపీ అధినేత, సీఎం జగన్ అప్పాయింట్మెంట్ దొరకడం లేదు! ఏం చేయమంటారు?’ ఇదీ.. ఇప్పటి వరకు.. పార్టీ నేతలు.. నాయకులు.. ఎమ్మెల్యేలు , కొందరు ఎంపీలు చెబుతున్న మాట. తమ నియోజకవర్గంలో అనేక సమస్యలు ఉన్నాయని.. వాటిని ప్రభుత్వ దృష్టికి తీసుకు వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నామని.. అయితే.. జగన్ తమకు అప్పాయింట్మెంట్ ఇవ్వడం లేదని.. వారు చెబుతున్నారు. వాస్తవానికి ఈ పరిస్థితి నిజమే. కొందరికి మాత్రమే.. జగన్ అప్పాయింట్మెంట్ ఇస్తున్నారు. ఆ కొందరిలోనూ.. అత్యంత కీలకమైన వారికి మాత్రమే జగన్ దర్శనం దొరుకుతోంది.
పోనీ.. ఎక్కడైనా బహిరంగ సభల్లో అయినా.. ఆయన పాల్గొంటే.. ఎక్కడొ ఒకచోట ఒక నిముషం సమయం కేటాయించుకుని.. ఆయనకు తమ బాధను వెల్లడించాలని కూడా నాయకులు ప్రయత్నిస్తున్నారు. కానీ, అది కూడా జగన్ ఛాన్స్ ఇవ్వడం లేదు. ఆయన ఎక్కడా పెద్దగా బయటకు రావడం లేదు. దీంతో నాయకులకు.. ముఖ్యంగా ఎమ్మెల్యేలకు తమసమస్యలు చెప్పుకొనే అవకాశం లేకుండా పోయింది. దీంతో ఈ విషయంపై వారు గుర్రుగా ఉన్నారు. సలహాదారు సజ్జలకు కూడా ఇదే విషయాన్ని వారు తేల్చి చెబుతున్నారు. సార్ ఇలా అయితే.. ఎలా? అంటూ.. ఒకింత అసహనం కూడా వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది.
ఈ క్రమంలో ఇన్నాళ్లు ఈ విషయాన్ని లైట్ తీసుకున్న పార్టీ అధిష్టానం.. ఇక ఇదే పరిస్థితి కొనసాగితే.. ఇబ్బందులు తప్పవని భావిస్తున్నట్టు కనిపిస్తోంది. దీంతో.. త్వరలోనే వారానికి రెండు సార్లు.. ఎమ్మెల్యేలు, ఎంపీలతో జగన్ సమావేశం అయ్యేలా ఒక కార్యాచరణ రూపొందిస్తున్నట్టు.. తాడేపల్లి వర్గాలు చెబుతున్నాయి. ప్రతి వారం.. కేటాయించిన నియోజకవర్గానికి సంబంధించిన ఎమ్మెల్యేలకు అప్పాయింట్ మెంట్లు ఇవ్వాలని.. జగన్ నిర్ణయించుకున్నట్టు సీఎంవో వర్గాలు కూడా చెబుతున్నాయి.
తొలి దశలో టీడీపీ పట్టున్న నియోజకవర్గాల్లో గత ఎన్నికల్లో వైసీపీ విజయం దక్కించుకున్న నియోజకవర్గాలకు ప్రాధా న్యం ఉంటుందని.. రోజుకు 5 నుంచి ఏడుగురు ఎమ్మెల్యేలకు అవకాశం కల్పిస్తారని.. చెబుతున్నారు. కనీసం ఒక్కొక్క ఎమ్మెల్యేకు 10 నుంచి 15 నిముషాల సమయం ఇవ్వనున్నారని అంటున్నారు. వారి సమస్యలు వినడం.. పరిష్కరించడానికి ప్రాధాన్యం ఇస్తారని.. చెబుతున్నారు. మరి ఈ వ్యూహం ఏమేరకు సక్సెస్ అవుతుందో చూడాలి.
Gulte Telugu Telugu Political and Movie News Updates