కుప్పం మున్సిపాలిటీ ఎన్నిక అధికార వైసీపీకి అనుకూలంగా వచ్చేట్లే ఉంది. పోలింగ్ తుది దశకు వచ్చిన దశలో చంద్రబాబునాయుడు మాట్లాడిన మాటలతో అందరిలోను ఇదే అనుమానాలు పెరిగిపోయాయి. ఎన్నికలో గెలవటం కోసం అధికార వైసీపీ ఇన్ని దౌర్జన్యాలు చేయాలా ? అధికార పార్టీ నేతలు ఇంత దారుణంగా వ్యవహరిస్తారా ? అంటు పలు విమర్శలు చేశారు. వైసీపీ నేతలను శాపనార్థాలు పెట్టారు. వైసీపీ నేతలు దగ్గరుండి మరీ దొంగ ఓట్లు వేయించారంటు మండిపోయారు.
ఏపీలో ఎన్నికలను ఇంతగా అపహాస్యం చేసిన ఘటనలు గతంలో ఎప్పుడూ జరగలేదంటు కోపంతో ఊగిపోయారు. ఇంకా చాలా చాలానే మాట్లాడారు. వైసీపీ నేతలపై చేయని ఆరోపణలు, విమర్శలు లేవు. ఇదంతా చూసిన తర్వాత టీడీపీ ఓటమి ఖాయమైపోయిందనే అంచనాలు ఒక్కసారిగా పెరిగిపోయాయి.
ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే కుప్పంలో దొంగ ఓట్లకు సంబంధించి చాలా హడావుడి జరిగింది. పోలీసు పవర్ ఎవరి వద్ద ఉంటే వారికి కొన్ని అవకాశాలు ఉండటం కామన్. అధికారంలో ఉండటం డెఫనెట్ గా వైసీపీకి అనుకూలించే అశమనటంలో సందేహం లేదు. ఎన్నికల్లో దొంగ ఓట్లు, గొడవలు ఇటీవల సాధారణం అయిపోయాయి.
జగన్ అధికారంలోకి వస్తే తమనింత టార్గెట్ చేస్తాడని చంద్రబాబు ఊహించి ఉండరు. ఏవేవో చేస్తారు గాని తన కుప్పం నియోజకవర్గంపై ఇంత దృష్టటిపెడతారని కూడా అనుకుని ఉండరు. దీనికి కారణం.. జగన్ చంద్రబాబుకు తీవ్రమైన రాజకీయ ప్రత్యర్థే కాకకుండా స్థానిక నేత పెద్దిరెడ్డికి కూడా చంద్రబాబే సుదీర్ఘకాల ప్రత్యర్థి కావడంతో వారు అదేపనిగా చంద్రబాబును మానసికంగా దెబ్బకొట్టడానికి తమ శక్తి మేర ప్రయత్నిస్తున్నారు. అందులో భాగమే కుప్పంపై ఫోకస్. అధికారం చేతిలో లేనపుడు ప్రజాస్వామ్యమని, దొంగఓట్లని, దౌర్జన్యాలని మీడియా సమావేశంలోకోపంతో ఊగిపోతే ఎలాంటి ఉపయోగం ఉండదు.
Gulte Telugu Telugu Political and Movie News Updates