ఏపీ అధికార పార్టీకి కలిసి వస్తున్న అంశాలు ఏంటి? వచ్చే ఎన్నికల్లో పార్టీకి మద్దతుగా నిలుస్తున్న అంశాలు ఏంటి? అనే విషయంపై ఆసక్తికర చర్చ సాగుతోంది. దీనికి నెటిజన్లు ఆసక్తిగా స్పందిస్తున్నారు. మూడు విషయాలు వైసీపీకి కలిసి వస్తున్నాయని చెబుతున్నారు. ఈ మూడు అంశాలను బలంగా తీసుకువెళ్తే.. ఇక. వైసీపీకి తిరుగు లేదని అంటున్నారు. అవేంటంటే ఒకటి.. జగన్ నాయకత్వం.. పార్టీ అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లు అయింది. నిజానికి ఎంతో మంది ఆశావహులకు పదవులు ఇవ్వలేక పోయారు. అదే సమయంలో కొత్తగా వచ్చిన వారికి అనూహ్యంగా పదవులు ఇచ్చారు.
ఇది సీనియర్లకు సహజంగానే కోపం తెప్పించే ప్రక్రియ. కానీ, ఎవరూ రోడ్డున పడలేదు. ఎవరూ అలగలేదు. ఎవరూ … జగన్‌కు వ్యతిరేకంగా గళం వినిపించలేదు. ఇది ఆయన నాయకత్వానికి ప్రతీకగా చెబుతున్నారు. ఇదే కంటిన్యూ చేస్తే ఇక తిరుగులేదని అంటున్నారు. అదే సమయంలో సీనియర్లకు కూడా ఛాన్స్ ఇస్తే.. పార్టీకి ఎప్పటికీ.. వైసీపీకి తిరుగులేదని చెబుతున్నారు. రెండో విషయం.. సంక్షేమ పథకాలతోపాటు.. మహిళలు. ఒకవైపు సంక్షేమ పథకాలను కనీ వినీ ఎరుగని రీతిలో అమలు చేస్తున్నారు. రాష్ట్రం ఏర్పడినత ర్వాత.. ఈ రేంజ్‌లో ఒక్కొక్క కుటుంబానికీ వేల రూపాయల్లో సంక్షేమ ఫలాలు అందిన పరిస్థితి లేదు.
ఇది.. వైసీపీకి కలిసి వస్తోంది. పైకి విపక్షాలు ఎంతగా ప్రచారం చేస్తున్నా.. జగన్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమం.. ప్రతి కుటుంబానికీ చేరుతోంది. ఇది వైసీపీకి మంచి బలంగా మారింది. అదేసమయంలో మహిళలకు అన్నిఅంశాల్లోనూ ప్రధాన ప్రాత పోషించేలా అవకాశం కల్పిస్తున్నారు. కీలకమైన రాజకీయ పదవులను వారికే ఇస్తున్నారు. అదేసమయంలలో వారి కుటుంబ సభ్యులు చక్రం తిప్పకుండా.. చట్టం రూపొందించడం ద్వారా ఆయా పదవుల్లో ఉన్నవారికి స్వేచ్ఛను కల్పించారు.
ఇకమూడో విషయం.. కేంద్రంతో సఖ్యతగా ఉండడంతోపాటు.. అవసరమైన పరిస్థితిలో.. పొరుగు రాష్ట్రంతోనూ.. సత్తా చూపించే స్థాయిలో వైసీపీ అడుగులు వేస్తుండడం కూడా జగన్‌కు కలిసి వస్తున్న అంశాలు గా చెబుతున్నారు. ఈ మూడు అంశాలకు నెటిజన్లు ఎక్కువ మార్కులు వేస్తున్నారు. ఇదే ఒరవడిని చూపిస్తే.. ఇక, వైసీపీకి తిరుగులేదని అంటున్నారు. ప్రస్తుతం వైసీపీ అవలంభిస్తున్న విధానాలు కూడా ఇవేనని చెబుతున్నారు. ఇకపై మరింత దూకుడుగా ఉంటే.. వైసీపీ వచ్చే ఎన్నికల్లో తిరుగులేని విజయం దిశగా దూసుకుపోతుందని అంటున్నారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates